
Badri Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో ఒకటి ‘బద్రి’.ఆరోజుల్లో యూత్ ని ఒక ఊపు ఊపేసిన సినిమా ఇది.పవన్ కళ్యాణ్ యాక్టింగ్,స్టైల్, యాటిట్యూడ్ మరియు డ్యాన్స్ ఆరోజుల్లో ఒక ప్రభంజనం. ఈ చిత్రం ద్వారానే సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే సరికొత్త కథాంశం తో మన ముందుకు వచ్చాడు, ఎంతో కస్టపడి పవన్ కళ్యాణ్ ని కలిసి,ఈ కథని ఒప్పించి చేసాడు.
అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చింది.అప్పట్లో ఇలాంటి కొత్త తరహా కథలకు ఫ్లాప్ టాక్ రావడం అనేది సర్వ సాధారణం. ఎంతో కస్టపడి ఇష్టంతో రాసుకున్న కథ ఇది, ఇలాంటి టాక్ వచ్చిందేంటి అని పూరి జగనాత్ డీలా పడ్డాడట. కానీ రెండవ రోజు నుండి ఈ సినిమాకి వస్తున్నా కలెక్షన్స్ ఆయన మైండ్ ని బ్లాక్ అయ్యేలా చేసింది అట.

ఆరోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 14 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది, సుమారుగా 57 డైరెక్ట్ కేంద్రాలలో 50 రోజులు మరియు 40 డైరెక్ట్ కేంద్రాలలో వంద రోజులు ఆడింది. కొన్ని ముఖ్యమైన సెంటర్స్ లో అయితే 200 రోజులు కూడా ఆడింది. అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా విడుదలై నేటికీ 23 ఏళ్ళు అవుతుంది.పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అనే బిరుదు కూడా ఈ సినిమా నుండే ప్రారంభం అయ్యింది.మెడ మీద చెయ్యి పోనించే పాపులర్ మ్యానరిజం కూడా ఈ సినిమా నుండే ప్రారంభం అయ్యింది.
ఇక ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించిన రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ ప్రేమాయణం నడిపి, కొనేళ్లు సహజీవనం చేసి వివాహం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అలా ఎన్నో సంఘటనలకు ఈ చిత్రం కేంద్ర బిందువుగా మారింది. టాలీవుడ్ కి సరికొత్త హీరోయిజం రుచి చూపించిన చిత్రం బద్రి.ఈ సినిమా స్పెషల్ షోస్ అభిమానులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు.