https://oktelugu.com/

Waltair Veerayya Release Date: ‘వాల్తేరు వీరయ్య’ 11 వ తేదీన విడుదల అవ్వబోతుందా..? సంచలన ప్రకటన చెయ్యబోతున్న నిర్మాతలు

Waltair Veerayya Release Date: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి..చిరంజీవి నుండి ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ చాలా కాలం తర్వాత రాబోతుండడం తో ఈ మూవీ పై ఇంత బజ్ ఏర్పడిందని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ […]

Written By: , Updated On : January 9, 2023 / 03:01 PM IST
Follow us on

Waltair Veerayya Release Date: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే..అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి..చిరంజీవి నుండి ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్ చాలా కాలం తర్వాత రాబోతుండడం తో ఈ మూవీ పై ఇంత బజ్ ఏర్పడిందని అందరూ అంటున్నారు.

Waltair Veerayya Release Date

Waltair Veerayya Release Date

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న వైజాగ్ లో అంగరంగ వైభవంగా జరిగింది..ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మూవీ యూనిట్ మొత్తానికి సినిమా మీద ఉన్న నమ్మకం ఎలాంటిదో కనిపించింది..ట్రైలర్ ని చూస్తేనే అర్థం అయిపోతుంది..సంక్రాంతికి మెగాస్టార్ మాస్ విద్వంసం ఎలా ఉండబోతుంది అనేది..అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హిట్ టాపిక్ గా మారింది.

అదేమిటి అంటే ఈ సినిమా ని జనవరి 13 వ తారీఖున కాకుండా జనవరి 11 వ తేదీన విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు..దిల్ రాజు నిర్మాణం లో తెరకెక్కిన ‘వారసుడు’ సినిమా వాయిదా పడడంతో 11 వ తేదీన వస్తే థియేటర్స్ భారీగా దొరుకుతాయని..ఓపెనింగ్స్ అదిరిపోతాయని నిర్మాతలు అనుకుంటున్నారట..ఇక మెగాస్టార్ చిరంజీవి తో చర్చలు జరిపి ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తుంది..వాస్తవానికి ఈ చిత్రాన్ని జనవరి 11 వ తేదీన విడుదల చెయ్యాలని మేకర్స్ సన్నాహాలు చేసారు..కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోలేదు.

Waltair Veerayya Release Date

Waltair Veerayya Release Date

కారణం జనవరి 13 వ తారీఖున వస్తే ఆ మరుసటి రోజు నుండి వరుసగా హాలిడే అడ్వాంటేజ్ వల్ల భారీ వసూళ్లు ఉంటాయని ఆ నిర్ణయం తీసుకున్నాడట..ఇప్పుడు వారసుడు సినిమా జనవరి 14 వ తేదికి వాయిదా పడింది కనుక 13 వ తేదీన వస్తే ‘వాల్తేరు వీరయ్య’ కి 14 నుండి థియేటర్స్ భారీగా నష్టపొయ్యే అవకాశం ఉంది..అందుకే ఈ నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టు తెలుస్తుంది..మరి చిరంజీవి ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.