Balakrishna: పబ్లిక్ లో హీరో బాలకృష్ణ చర్యలు పలుమార్లు వివాదాస్పదం అయ్యాయి. ఆయన చేయి, నోరు అదుపులో ఉండవు. అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైనా చేయాలని చెప్పి పెద్ద సంచలనానికి తెరలేపాడు బాలయ్య. ఓ మూవీ వేడుకలో బాలయ్య మహిళలను కించపరిచేలా చేసిన ఈ కామెంట్స్ తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. బాలయ్య మాట దురుసు అలా ఉంచితే చేతి దురద మరీ దారుణం. బాలయ్య చేతిలో దెబ్బలు తిన్న అభిమానులు పదుల సంఖ్యలో ఉన్నారు. తమ అభిమాన హీరోని చూడాలని, చేత్తో తాకాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. బాలయ్య అలాంటి వాళ్లకు చెంపదెబ్బతో సమాధానం చెబుతారు.

రోడ్డుపై వెంబడించి అభిమానులను కాలితో తన్నిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే దాన్ని ఒక నేరంగా బాలయ్య చూడడు. తన చేతిలో దెబ్బలు తినడం అదృష్టంగా భావిస్తారు, అంటాడు. నా చేయి తాకినందుకు ఆనందం వ్యక్తం చేస్తారు, ఫ్యాన్స్ నేను కొట్టే దెబ్బలను అవమానంగా తీసుకోరని బాలయ్య అంటారు. కాగా అభిమానులను కొట్టడం బాలయ్య ఎలా సమర్ధించుకున్నాడో రచయిత సాయి మాధవ్ బొర్రా వెల్లడించారు. బాలయ్య ఆయనతో ఓ సందర్భంలో స్వయంగా వివరణ ఇచ్చారట.
హీరోలు అభిమానులను కంట్రోల్ చేయడానికి బౌన్సర్స్ ని పెట్టుకుంటారు. హీరో మీదకు దూసుకొచ్చే ఫ్యాన్స్ ని బౌన్సర్లు అదుపు చేస్తారు. కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తిస్తారు, కొడతారు. అసలు మన అభిమానులను కొట్టడానికి బౌన్సర్లు ఎవరు? వాళ్ళను కోడిగిడితే నేను కొట్టాలి. అభిమానులను కొట్టినా వాళ్ళతో నేను డీల్ చేసుకుంటాను. అసలు హీరోలు బౌన్సర్స్ ని పెట్టుకోవడం ఏంటీ… అని బాలయ్య అన్నారట.

దర్శకుడు పూరి జగన్నాధ్ సైతం ఓ సందర్భంలో… మిగతా హీరోలకు బౌన్సర్లు కావాలి. కానీ బాలయ్య గారికి అవసరం లేదు. ఆయన అభిమానుల్ని ఆయనే కంట్రోల్ చేసుకోగలడు అని చెప్పారు. నా అభిమానులపై ఎవడో బౌన్సర్ చేయి చేసుకోవడం ఏమిటన్న లాజిక్ బాగానే ఉంది కానీ… ప్రేమించే వారితో దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకుంటే వాళ్ళ మనసులు హర్ట్ అవుతాయి కదా. ఈ విషయంలో అభిమానుల అభిప్రాయం ఏదైనా కానీ.. బాలయ్య తన నేచర్ ఇదే అంటారు. పలు విమర్శలు వచ్చిన తర్వాత కూడా బాలయ్య అభిమానులపై చేయి చేసుకున్నారు. ఇటీవల వీరసింహారెడ్డి సెట్స్ లో బాలయ్య వీరంగం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆయన ఉగ్రరూపం చూసి దర్శకుడు కూడా బెంబేలెత్తిపోయాడట.