Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరో గా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమాలో మెగాస్టార్ తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు..ఇప్పటికే చిరంజీవి కి సంబంధించిన ఇంట్రడక్షన్ టీజర్ మరియు ఒక లిరికల్ వీడియో సాంగ్ విడుదల చెయ్యగా, రవితేజ క్యారక్టర్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన చిన్న మైక్రో టీజర్ ని ఈ నెల మొదటి వారం లోనే విడుదల చెయ్యబోతున్నారు..ఇందులో రవితేజ చిరంజీవి కి తమ్ముడిగా నటిస్తున్నాడు.

హీరో గా రవితేజ నిలదొక్కుకుంటున్న సమయం లో చిరంజీవి తో కలిసి ఆయన అన్నయ్య అనే సినిమా చేసాడు..అది అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది..మళ్ళీ రవితేజ స్టార్ హీరో అయ్యాక చిరంజీవితో మరోసారి నటిస్తున్నాడు..వీళ్లిద్దరి మధ్య ఈ సినిమాలో ప్రథమార్థం మొత్తం ‘నువ్వా నేనా’ అనే రేంజ్ లో కొనసాగుతుందట..శృతి హాసన్ ఇందులో హీరోయిన్ గా నటించగా..దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
సినిమాకి సంబంధించిన కాస్ట్ & క్రూ మొత్తం అందరికి తెలుసు కానీ, విలన్ ఎవరు అనేది మాత్రం ఇంకా బయటపెట్టలేదు మూవీ టీం..చిరంజీవి మరియు రవితేజ వంటి హేమాహేమీలను ఢీ కొట్టాలంటే అవతల వైపు విలన్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉండాలి..మరి ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై ఇప్పటి వరుకు ఒక్క ప్రకటన కూడా రాలేదు..అసలు ఈ సినిమాలో విలన్ ఉన్నాడా లేదా అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొన్నాయి..ఇద్దరు ఊర మాస్ హీరోలకు మాస్ సబ్జెక్టు దొరికినప్పుడు విలన్ పాత్ర బాగాలేకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

ఇలాంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ పరంగా ఫ్లాప్స్ గా నిలిచాయి..అలా వాల్తేరు వీరయ్య అవ్వకూడదని అభిమానులు కోరుకుంటున్నారు..అయితే అభిమానులు భయపడాల్సిన అవసరం అసలు ఏ మాత్రం లేదనీ..సినిమా మెగాస్టార్ అభిమానులకు అలాగే రవితేజ అభిమానులకు కనుల పండుగలాగా ఈ సినిమా నిలుస్తుందని చెప్తున్నారు విశ్లేషకులు.