Manchu Vishnu Ginna: ఈమధ్య కాలం లో మంచు హీరోలు సృష్టిస్తున్న కొన్ని అరుదైన రికార్డులు భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఎంత కష్టపడినా సృష్టించలేరేమో..మంచు మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రం ఒక చరిత్ర..షేర్ కాదు కదా..కనీసం గ్రాస్ వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది..ఇక ఈ రికార్డు ని ఎవ్వరు కొట్టలేరులే అని అనుకుంటున్న సమయం లో ఆయన తనయుడు మంచు విష్ణు ‘జిన్నా’ సినిమా తో నేనున్నాను అంటూ వచ్చాడు.

సన్ ఆఫ్ ఇండియా తో పోలిస్తే ఈ చిత్రానికి టాక్ బాగానే వచ్చింది..కాస్టింగ్ కూడా చాలా పెద్దదే..మనల్ని చూసి జనాలు కదలరు అని ఫిక్స్ అయినా మంచు విష్ణు..సన్నీ లియోన్ , పాయల్ రాజ్ పుత్ వంటి క్రేజీ హీరోయిన్స్ ని ఈ సినిమా కోసం పెట్టుకున్నాడు..కనీసం వాళ్ళని చూసి కూడా ఆడియన్స్ థియేటర్స్ కి కదలలేదు..ఫలితంగా ఈ సినిమాకి క్లోసింగ్ లో 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది.
ఇక ఓటీటీ లో మరియు యూట్యూబ్ లో తన సినిమాలకు మంచి క్రేజ్ ఉందని చెప్పుకునే మంచు విష్ణు కనీసం OTT లో అయినా తన ‘జిన్నా’ సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారేమో అని ఆశపడి నిన్న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసారు..ఇక్కడ కూడా ఈ సినిమాకి అరుదైన రికార్డ్స్ క్రియేట్ అవ్వక తప్పలేదు..24 గంటలకు గాను ఈ సినిమాకి లక్ష లోపే వాచ్ మినిట్స్ వచ్చాయట..సంపూర్ణేష్ బాబు వంటి హీరోలకు కూడా 24 గంటల్లో మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చే ఈ కాలం లో మంచు కుటుంబానికి లక్షలోపు వాచ్ మినిట్స్ రావడం అంటే అరుదైన రికార్డు అనే కదా.

నెటిజెన్స్ కనీసం ట్రోల్ స్టఫ్ ని ఎంజాయ్ చెయ్యడానికి కూడా ఈ సినిమాని చూడడం లేదనీ తెలిసింది..ఇంతటి దయనీయమైన స్థితి లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఏకైక కుటుంబం గా మంచు ఫ్యామిలీ నిలిచింది..సినిమాలు మానేసి వేరే ఏదైనా వ్యాపారం చూసుకుంటే బెటర్ అని నెటిజెన్స్ సోషల్ మీడియా లో మంచు కుటుంబానికి సలహాలు ఇస్తున్నారు.