
Amigos Movie Story: మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచం ఏడు మంది ఉంటారని అందరూ అంటూ ఉంటారు, ఇది నిజమే.అచ్చు గుద్దినట్టు ఒకేలాగ ఉండకపోయినా 90 శాతం వరకు మ్యాచింగ్ చెయ్యగల వ్యక్తులను చాలామందిని మనం నిజజీవితం లో కూడా చూసి ఉంటాము..నేడు విడుదలైన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ చిత్రం కథ నిజ జీవితం లో జరిగిన ఒక సంఘటన ని ఆధారంగా తీసుకొని చేసిన సినిమానే.మెక్సికో ప్రాంతం లో ఇలాగే ఒకే రూపం తో ఉన్న ముగ్గురు వ్యక్తులు కలిసి జీవించారట..ఆరోజుల్లో ఈ ముగ్గురిని ఇంటర్వ్యూ కూడా చేసారు.
Also Read: Suryakumar Yadav: ‘సూర్య’ విలాపం : టీ20 ప్లేయర్ ను టెస్టుల్లో ఆడిస్తే ఇంతే
అది అప్పట్లో తెగ వైరల్ గా మారింది..ఆ సంఘటనని ఆధారంగా తీసుకొని చాలా సినిమాలు వచ్చాయి..ఇప్పుడు ‘అమిగోస్’ చిత్రం కూడా అందులో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు..అయితే ఈ సినిమాటిక్ లిబర్టీ కోసం కాస్త లేనివి ఉన్నట్టుగా కల్పించి ఒక పాత్ర నెగటివ్ గా చూపించారు కానీ, ఈ సినిమా తియ్యడానికి వచ్చిన ఐడియా మాత్రం మెక్సికో లో ఉన్న ఆ ముగ్గురి జీవితాన్ని ఆధారంగా తీసుకున్నదే.
కేవలం మెక్సికో లో మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తులు ప్రతీ దేశం లోను ఉన్నారు..వాళ్ళు మాట్లాడిన మాటలను ఆధారంగా తీసుకొనే ఈ స్టోరీ ని సిద్ధం చేసాడు డైరెక్టర్ రెజేందర్ రెడ్డి..మొదటి సినిమా అయ్యినప్పటికీ కూడా ఆడియన్స్ ని తికమక పెట్టకుండా చాలా చక్కగా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దాడు.కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఈ చిత్రం ‘భింబిసారా’ రేంజ్ లో కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని చెప్పలేం కానీ, బ్రేక్ ఈవెన్ మార్కుని మాత్రం కచ్చితంగా అందుకుంటుందని మాత్రం చెప్పగలం..గతంలో త్రిపాత్రాభినయం తో స్వర్గీయ నందమూరి తారకరామారావు తర్వాత కమల్ హాసన్ మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి హీరోలు చేసారు.

నేటి జెనెరేషన్ లో మాత్రం నందమూరి కుటుంబానికి చెందిన వాళ్ళు మాత్రమే చేసారు..జూనియర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సినిమాలో ఎంత అద్భుతంగా నటించాడో మన అందరికీ తెలిసిందే, కళ్యాణ్ రామ్ కూడా ‘అమిగోస్’ చిత్రం లో అంతే అద్భుతంగా నటించాడు, కమర్షియల్ గా ఎంత చేస్తుంది అనేది పక్కన పెడితే కొత్త తరహా కథలను ప్రేక్షకులకు అందించాలనే కళ్యాణ్ రామ్ తపనని మాత్రం మెచ్చుకొని తీరాల్సిందే.
Also Read:
Heroine Roshini: చిరంజీవి సూపర్ హిట్ మూవీలో నటించిన రోషిణి ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?