https://oktelugu.com/

Puri Jagannath Charmi: పూరి – చార్మి బంధం బయటపెట్టిన ఆకాష్.. ఎఫైర్ నిజమేనా?

Puri Jagannath Charmi: ఎవరైనా చెట్టంత కొడుకు సినిమా ఫంక్షన్ కు హాజరు కాకుండా ఉంటారా? టాలీవుడ్ లోనే గొప్పదర్శకుడిగా ఎదిగిన పూరి జగన్నాథ్ తన సొంత కొడుకు సినిమా ఫంక్షన్ కు రాకపోవడమే ఇప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితులైన బండ్ల గణేష్, పరుశురామ్, సాయిరాం శంకర్, విశ్వక్ సేన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొనడం తండ్రి పూరి గైర్హాజరు కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. కొద్దిరోజులుగా పూరి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 23, 2022 / 07:42 PM IST
    Follow us on

    Puri Jagannath Charmi: ఎవరైనా చెట్టంత కొడుకు సినిమా ఫంక్షన్ కు హాజరు కాకుండా ఉంటారా? టాలీవుడ్ లోనే గొప్పదర్శకుడిగా ఎదిగిన పూరి జగన్నాథ్ తన సొంత కొడుకు సినిమా ఫంక్షన్ కు రాకపోవడమే ఇప్పుడు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎందుకంటే పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితులైన బండ్ల గణేష్, పరుశురామ్, సాయిరాం శంకర్, విశ్వక్ సేన్ తదితరులు ఈ వేడుకలో పాల్గొనడం తండ్రి పూరి గైర్హాజరు కావడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

    కొద్దిరోజులుగా పూరి జగన్నాథ్ పెళ్లాం పిల్లలతో కాకుండా నటి చార్మితో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్ట్రాట్ చేసి ఆమెతో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘లైగర్’ సినిమా తీస్తూ ముంబైలో బిజీగా ఉంటున్నాడు. చార్మితో పూరి బంధం బాగా వేరే లెవల్ లో ఉందని.. ఈ మేరకు పూరి భార్యతో గొడవలు జరిగాయని పుకార్లు షికార్లు చేశాయి. అయితే పూరి కొడుకు ఆకాష్ వీటిని ఖండించినా కూడా ఆ గాసిప్పులు తగ్గలేదు.

    తాజాగా ఇంటర్వ్యూల్లోనూ నాన్న పూరికి, అమ్మకు విడాకులు లేవని ఆకాశ్ స్పష్టం చేశారు. అయితే ఆకాష్ పూరి తాజా చిత్రం ‘చోర్ బజార్’ ప్రీరిలీజ్ కు ఏకంగా తండ్రి పూరి జగన్నాథ్ రాకపోవడంతో అందరిలోనూ అనుమానాలు బలపడ్డాయి. పూరి ముంబైలో చార్మితో కలిసి ఉన్నాడని తెలియడంతో అందరికీ విభేదాలున్నాయన్న విషయం లీక్ అయ్యింది.

    బండ్ల గణేష్ సైతం ‘చోర్ బజార్’ ప్రీరిలీజ్ వేడుకలో హాట్ కామెంట్స్ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. పూరి చేతిలో రూపాయి లేకున్నా నమ్మి వచ్చిన భార్య లావణ్య గొప్పతనాన్ని వివరిస్తూ.. చార్మిని, పూరిని పరోక్షంగా విమర్శించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.

    ఇక ఆకాష్ పూరి సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. పూరి జగన్నాథ్ సపోర్ట్ నాకు వద్దని.. ఆయన నీడలో తాను ఎదగాలని అనుకోవడం లేదని అనడం సంచలనమైంది. తాను సొంతంగా ఎదగాలనుకుంటున్నానని అనడంతో నాన్న పూరితో విభేదాలు బయటపడ్డాయి. దీన్ని బట్టి పూరి -చార్మి బంధం.. కొడుకు సినిమా వేడుకకు పూరి రాకపోవడాన్ని బట్టి అందరిలోనూ అనుమానాలు వస్తున్నాయి. మరి దీనికి పూరినే సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

    Recommended Videos