Chiranjeevi- Ram Charan And Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు.. ఈ విషయాన్నీ స్వయంగా మెగా స్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలియజేసాడు..ఫ్యాన్స్ అందరూ మెగా వారసుడికోసం ఎన్నో ఏళ్ళ నుండి ఎదురు చూస్తూ ఉన్నారు..ఉపాసన – రామ్ చరణ్ కి పెళ్లి జరిగి పదేళ్లు దాటింది.. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అవ్వడం తో కొన్నేళ్లు పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నారు.

దాంపత్య జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేసారు..ఇప్పుడు ఉపాసన కాస్త వృత్తి పరంగా రిలాక్స్ అయ్యింది..దీనితో వీళ్లిద్దరు తల్లితండ్రులయ్యారు..ఇక మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి హద్దులే లేకుండా పోయింది..’ఆంజనేయ స్వామి ఆశీస్సులతో రామ్ చరణ్ – ఉపాసన మొదటి సంతానం కి జన్మని ఇవ్వబోతున్నారు’ అంటూ ట్విట్టర్ లో ఒక ట్వీట్ షేర్ చేసాడు..అది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది..ఈ ట్వీట్ ని మెగాస్టార్ షేర్ చేసిన నిమిషాల వ్యవధి లోనే వేలకొద్ది రీట్వీట్స్ మరియు లైక్స్ వచ్చాయి.
ఇక అభిమానుల సంగతి తెలిసిందే కదా..ఇంకా బిడ్డ పుట్టకముందే అప్పుడే ఆ బిడ్డకి పేర్లని కూడా డిసైడ్ చేసేసారు..రామ్ చరణ్ కి తన తండ్రి మరియు బాబాయ్ పవన్ అంటే దేవుళ్లతో సమానం కాబట్టి చిరంజీవి – పవన్ కళ్యాణ్ పేర్లు కలిసొచ్చేలా పెట్టబోతున్నారని కొంతమంది.. అలాగే ఉపాసన కుటుంబ పరంపర నుండి వస్తున్న పేరు పెట్టబోతున్నారని.. ఇలా పలురకాల ప్రచారాలు జోరుగా జారుతున్నాయి..

కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిరంజీవి కుటుంబ వారసులకు మొత్తం చివర్లో ‘తేజ్’ అని ఉంటుంది..కాబట్టి మగ బిడ్డ పుడితే ‘అంజన్ తేజ్’ అని..ఆడ బిడ్డ పుడితే ‘అంజనీ’ అని పెట్టాలని రామ్ చరణ్ – ఉపాసనలు ఎప్పుడో ఫిక్స్ అయ్యారని చెప్తున్నారు..ప్రస్తుతం ఉపాసనకి మూడవ నెల..మరో ఆరు నెలల్లో ఆమె ప్రసవించనుంది..మెగా అభిమానులకు నిజంగా ఇది ఒక పండుగలాంటి వార్త.
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 12, 2022