Vijaya Nirmala- Krishna Marriage: తెలుగు సినిమాకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఏమిటో తెలియచేసిన మహానుభావుడు..సాహసాలకు మరోపేరు..గుణంలో దేవుడు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారు నేడు ఉదయం కాలం చెందిన దుర్ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ఇండస్ట్రీ లో గోల్డెన్ శకంకి నాంది పలికిన కృష్ణ గారిని కోల్పోవడం ఇండస్ట్రీ కి తీరని లోటు..ఎన్నో ఆటుపోట్లని ఎదురుకొని సూపర్ స్టార్ గా నిలిచినా కృష్ణ గారు తనకి ఈ గొండెపోటు వచ్చినప్పుడు కూడా చికిత్స విజయవంతంగా పూర్తి చేసుకొని బయటకి వస్తారని అభిమానులు ఆశించారు.
కానీ నిన్నటి సాయంత్రం నుండి కృష్ణ గారి శరీరం అవయవాలు ఒక్కొక్కటిగా ఫెయిల్ అవుతూ వచ్చాయి..అలా చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తెల్లవారుజామున ప్రాణాలను వదిలేసారు..ఉదయం నిద్రలేవగానే ప్రతి తెలుగోడు ఈ విషాదకరమైన వార్తని విని శోకసంద్రం లో మునిగిపోయారు..కృష్ణ గారు నెల రోజుల క్రితమే తన సతీమణి ఇందిరాదేవి గారిని కోల్పోయారు..ఆ బాధ నుండి ఆయన కోలుకునేలోపే ఇందిరా దేవి గారి వద్దకి వెళ్లిపోవడం అభిమానులను కలిచివేస్తుంది.
కృష్ణ గారి వ్యక్తిగత జీవితం తెరిచినా పుస్తకం లాంటిది..వ్యక్తిగతంగా ఒక్క బ్లాక్ మార్కు కూడా లేని కృష్ణ గారు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం ఏమిటి..ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అని చాలా మందికి మెదిలే ప్రశ్న..కృష్ణ గారు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందే ఇందిరా దేవి గారిని పెళ్లాడారు.. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కృష్ణ గారు ఎన్నో సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్స్ తో పని చేసినప్పటికీ కూడా విజయనిర్మల గారితో సినిమాలు చేసినప్పుడు ఆమెతో ఆయనకీ ఎంతో సన్నిహిత్య సంబంధం ఏర్పడింది.
అది పోనుపోను ప్రేమగా మారి రహస్యంగా ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు..ఈ విషయాన్నీ కృష్ణా గారు ఎక్కువ కాలం దాచిపెట్టలేదు..కుటుంబ సబ్యులతోపాటుగా ఇందిరా దేవి గారికి కూడా చెప్పేసారు..ఈ విషయం విన్న వెంటనే ఇందిరా దేవి గారు చాలా మౌనం గా ఉండిపోయారట..ఆ తర్వాత కాస్త సమయం తీసుకొని కృష్ణ గారి రెండవ వివాహాన్ని ఆహ్వానించారట.
మీకు రెండవ పెళ్లి అయ్యినప్పటికీ కూడా నేను మీకు తోడుగా ఉంటాను..మీ సతీమణి గా నేను కొనసాగుతానని ఇందిరా దేవి గారు కృష్ణ గారితో అన్నారట..అప్పటి నుండి కృష్ణ గారు తన ఇద్దరి సతీమణులను రెండు కళ్లులాగా చూసుకుంటూ వస్తున్నారు..ఇందిరా దేవి గారి త్యాగాన్ని గుర్తించి కృష్ణ గారు విజయ నిర్మల గారితో ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోలేదు..వీళ్లిద్దరికీ ఎలాంటి సంతానం కలుగలేదు..అలా కృష్ణ గారి వైవాహిక జీవితం కొనసాగింది.