Homeట్రెండింగ్ న్యూస్Titan Submarine Accident : టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి కారణం అదేనా..!

Titan Submarine Accident : టైటాన్ సబ్ మెరైన్ ప్రమాదానికి కారణం అదేనా..!

Titan Submarine Accident : టైటానిక్ శకలాలను చూసేందుకు టైటాన్ సబ్ మెర్సిబుల్ లో వెళ్లిన ఐదుగురు ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతి చెందిన వాళ్లంతా అపర కోటీశ్వరులు. పైగా సాహసాలు అంటే ఇష్టపడే వాళ్ళు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగి ఉంటుంది అన్న చర్చ సర్వత్రా జరిగింది. దీనిపై అనేక రకాల ఊహాగానాలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ మెర్సిబుల్ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి..? ఈ ప్రమాదం ఎందుకు జరిగింది..? వంటి విషయాలను దీనిపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆ విషయాలను మనము తెలుసుకుందాం.
టైటాన్ టూరిస్ట్ సబ్ మెర్సిబుల్ నిర్మాణ సమయంలో ఖర్చులను ఆదా చేయడానికి ఓషన్ గేట్ ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. అలాగే సబ్ మెర్సిబుల్ డిజైన్ లోని అనేక లోపాలు కూడా ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సబ్ మెర్సిబుల్ డిజైన్ లో బలహీనమైన అంశాలను శాస్త్రవేత్తలు గుర్తించి వివరించారు.  ఒక ముఖ్యమైన వ్యయ తగ్గింపు చర్యల్లో భాగంగా టైటాన్ ను డెక్ పై తీసుకెళ్లడానికి చాలా చిన్నదైన పోలార్ ప్రిన్స్ అనే మదర్ షిప్ ను  అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది. దీని ఫలితంగా సబ్ మెర్సిబుల్ మూడు రోజులపాటు కఠినమైన సముద్ర జలాల మధ్య పేలిపోయి ఉండవచ్చని అంచనా వేశారు. అసాధారణ డిజైన్ల ఎంపిక, టెస్టింగ్ నిర్వహణ లోపం, సర్టిఫికేషన్ పర్యవేక్షణ వంటి లోపాలతో సబ్ మెర్సిబుల్ పేలుడు సంభవించి ఉండవచ్చని వెల్లడించారు. సాంప్రదాయ సబ్ మెర్సిబుల్ కాకుండా మాత్ర ఆకారపు డిజైన్ చేశారని వివరించారు. దీనివలన ప్రమాదం సంభవించి ఉండవచ్చు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎక్కువమంది పట్టాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా డిజైన్ చేశారని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సాధారణంగా సముద్ర జలాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి గోళాకారంగా తయారు చేయాలి. కాని ఈ సబ్ మెర్సిబుల్ భిన్నంగా తయారు చేశారని శాస్త్రవేత్తలు వివరించారు. 1973 నుంచి ఎటువంటి ప్రమాదాలు లేకుండా 4500 లోతైన సముద్ర డైవ్ లను పూర్తి చేసిన ఆల్విన్.. కారా పొట్టను కలిగి ఉంది. టైటాన్, యూఎస్ ప్రభుత్వ రీసెర్చ్ సబ్ ఆల్విన్ మధ్య ప్రధాన తేడా ఇదేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
టైటానియంకు బదులు కార్బన్ ఫైబర్ వినియోగం..
ఆల్విన్ పెద్ద క్రేన్ ను ఉపయోగించి సముద్రంలోకి దింపుతారు. కానీ సబ్ మెర్సిబుల్ ను ఒక చిన్న చార్టెడ్ నౌక సముద్ర జలాల్లోకి పంపించారని వెల్లడించారు శాస్త్రవేత్తలు. టైటాన్ సెంట్రల్ సిలిండర్ సాధారణంగా ఉపయోగించే టైటానియం కు బదులుగా కార్బన్ ఫైబర్ ను ఉపయోగించి నిర్మించారని వివరించారు. కార్బన్ సైబర్ తో టైటానియంను తయారు చేశారు. ఇవి అధిక నీటి పీడనం ఈ లోహాలు తట్టుకోలేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఓసియన్ గేట్ సీఈవో స్టాక్ టన్ రస్ పరీక్ష, ధ్రువపత్రాల విధానం పరిశీలనలో ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. జూన్ 18న టైటానిక్ శిధిలాల వద్దకు డైవ్ చేస్తున్న సమయంలో టైటాన్ పేలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓషన్ గేట్ సీఈవో స్టాక్ టన్ రస్, బ్రిటిష్ బిలియనీర్ హమిష్ హార్దింగ్, ఫ్రెంచ్ టైటానిక్ నిపుణుడు పాల్ హెన్రీ నార్గో లెట్, పాకిస్తానీ వ్యాపారవేత్త షాజదా దావూద్, అతని కుమారుడు సులైమాన్ దావూద్ ప్రాణాలను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సాహస యాత్రకులను భయాందోళనకు గురి చేసింది.
RELATED ARTICLES

Most Popular