NBK X PSPK Part 1 PROMO : పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఎంత సంచలనం రేపుతుందో మన అందరికి తెలిసిందే..ఆయనకీ ఉన్న అనితరసాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల పవర్ స్టార్ ఏమి చేసినా అది సెన్సేషన్ అవుతుంది..అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ కలలో కూడా ఒక టాక్ షో కి వస్తాడని ఎవ్వరూ ఊహించలేదు..కానీ ఆహా మీడియా లో బాలయ్య బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్’ ప్రోమో కి ముఖ్య అతిధిగా విచ్చేశాడు పవన్ కళ్యాణ్.
గత ఏడాది డిసెంబర్ లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ఎపిసోడ్ ని వచ్చే నెల మూడవ తారీఖున ఆహా లో ప్రసారం కానుంది..అయితే ప్రోమో లోనే చాలా మ్యాటర్ చూపించేసారు..ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు అనేది తెలుసుకోవడానికి చాలా కాలం నుండి అభిమానులతో పాటుగా కోట్లాది మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు..ఆ ఎదురు చూపులకు ఇక తెరపడినట్టే అనుకోవచ్చు.
ముందుగా బాలయ్య పవన్ ని ప్రశ్నిస్తూ ‘ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా’ అని అడుగుతాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ ‘నా సంస్కారం అడ్డొచ్చి ఇన్ని రోజులు వాళ్ళ గురించి చెప్పకుండా ఉన్నాను’ అంటూ తన మాజీ భార్యలను ప్రస్తావిస్తూ కామెంట్స్ చేసాడు..పూర్తి గా ఏమి మాట్లాడాడు అనేది తెలియాలంటే ఫిబ్రవరి 3 వరకు వేచి చూడాల్సిందే.
అంతే కాకుండా సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ ఎదురుకున్న స్ట్రగుల్స్ గురించి కూడా ఈ ప్రోమో లో చెప్పుకొచ్చాడు..’అన్నయ్య రూమ్ కి వెళ్లి పిస్టల్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను’ అని అంటాడు..అక్కడి వరకు ప్రోమో ని కట్ చేసారు..ఇక ప్రోమో లాస్ట్ లో బాలయ్య బాబు తో పవన్ కళ్యాణ్ ఆయన సిగ్నేచర్ మ్యానరిజం ని ఇమిటేట్ చేస్తూ ‘చూస్తూనే ఉండండి ఆహా’ అని అంటాడు.