
NTR- Ram Charan: #RRR సినిమా ద్వారా ఆన్ స్క్రీన్ పై ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ స్నేహాన్ని చూసి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ఎంతగానో మురిసిపోయారు. ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాదు, బయట కూడా వీళ్లిద్దరు అంతకు మించి గొప్ప స్నేహితులు, నిన్న మొన్నటి వరకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కానీ, ఎప్పటి నుండి అయితే #RRR కి అంతర్జాతీయ అవార్డ్స్ రావడం ప్రారంభం అయ్యిందో, అప్పటి నుండి ఈ ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రగిలింది అని అంటున్నారు ఇండస్ట్రీ కి సంబంధించిన కొంతమంది ప్రముఖులు.
తారకరత్న చనిపోవడం తో ఎన్టీఆర్ అంతర్జాతీయ అవార్డ్స్ వేడుకలకు హాజరు కాలేకపోయాడు. దీనితో కేవలం రామ్ చరణ్ మాత్రమే పాన్ వరల్డ్ రేంజ్ లో హైలైట్ అయిపోయాడు. ఇది ఎన్టీఆర్ కి కాస్త జీర్ణించుకోవడానికి కష్టం అయ్యింది, అంతే కాకుండా మూవీ టీం కి వచ్చిన ‘HCA ‘ అవార్డుని కేవలం రామ్ చరణ్ మరియు రాజమౌళి కి మాత్రమే వచ్చినట్టు జనాల్లో ప్రాజెక్ట్ అయ్యింది.
పవన్ కళ్యాణ్ స్థాయి వ్యక్తి కూడా రామ్ చరణ్ కి మాత్రమే అవార్డు వచ్చింది అనుకొని ఆయనకీ ప్రత్యేకించి కృతఙ్ఞతలు తెలియచేసాడు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఎన్టీఆర్ కి కూడా ఇబ్బందిగా అనిపించింది. దానికి తోడు మెగాస్టార్ చిరంజీవి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ #RRR లో రామ్ చరణ్ క్యారక్టర్ ని పొగడ్తలతో ముంచి ఎత్తిన వీడియో ని ప్రత్యేకంగా ఎడిట్ చేయించి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అప్లోడ్ చేసాడు, ఇది కూడా ఎన్టీఆర్ కి నచ్చలేదట. ఇక అప్పటి నుండి ఎన్టీఆర్ మెల్లగా రామ్ చరణ్ ని దూరం పెడుతూ రావడం ప్రారంభించాడు.

నిన్న సాయంత్రం ఆయన తన నివాసం లో స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు.ఇందులో ఎన్టీఆర్ కి సన్నిహితం అనుకున్న అందరూ ఉన్నారు కానీ, రామ్ చరణ్ మాత్రం లేదు. ఎన్టీఆర్ లో ఎందుకు సడన్ గా ఇంత మార్పు, ఆయన టీం కూడా ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ కోసం రామ్ చరణ్ ని పూర్తిగా పక్కకి నెట్టేసి కేవలం ఎన్టీఆర్ ని మాత్రమే ప్రమోట్ చేసుకున్నారు కదా,అప్పుడు రామ్ చరణ్ ఇలా ఎన్టీఆర్ లాగ ప్రవర్తించలేదే, కానీ ఎన్టీఆర్ ఎందుకు ఇలా దూరం చేస్తున్నాడు రామ్ చరణ్ ని?, చరణ్ పట్ల నిజంగా ఎన్టీఆర్ కి అంత అసూయ ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.