Homeఆంధ్రప్రదేశ్‌MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? షాకింగ్ పరిణామాలు

MP Avinash Reddy: ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదా? షాకింగ్ పరిణామాలు

MP Avinash Reddy
MP Avinash Reddy
MP Avinash Reddy
MP Avinash Reddy

MP Avinash Reddy: వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ తుది దశకు చేరుకుందా? ఇక అరెస్ట్ ల పర్వం ప్రారంభంకానుందా? సునిల్ యాదవ్  బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ తో ఈ కేసులో స్పష్టత వచ్చిందా? కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి విచారణకు పిలవడం దేనికి సంకేతం? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ నుంచి తెలంగాణకు మారిన తరువాత వివేకా హత్య కేసు విచారణలో వేగం పెరిగింది. నిందితులు, అనుమానితుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. అయితే కీలక వ్యక్తుల ను వరుసగా విచారణకు పిలుస్తుండడంతో అరెస్టలు కూడా స్టార్ట్ కానున్నాయని ప్రచారం ఊపందుకుంది.

ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండుసార్లు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన వెల్లడించిన కొన్ని విషయాలను బట్టి కేసులో కొంతవరకూ పురోగతి సాధించారు. జగన్ ఓఎస్డీ, ఆయన సతీమణి భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ తదితరుల పాత్రపై విచారణ చేపట్టారు. వారికి కూడా నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే తనకు మరోసారి విచారణకు పిలిచే చాన్స్ లేదని అవినాష్ రెడ్డి చెబుతున్న తరుణంలో సడెన్ గా సీబీఐ అధికారులు పులివెందుల చేరుకున్నారు. కనీసం టైమ్ ఇవ్వకుండా సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. అయితే తనకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా విచారణకు హాజరుకాలేని అవినాష్ రెడ్డి చెప్పినా సీబీఐ అధికారులు వినలేదు. ఎట్టి పరిస్థితుల్లో హాజరుకావాల్సిందేనని తేల్చిచెప్పారు.

Also Read: Chanakya Niti: మనం ఎవరినైనా నమ్మే ముందు ఇవి పాటించాలి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తుది దశకు చేరుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీ పరిధిలో విచారణ సాగినప్పుడు తమకు నచ్చినట్టు దర్యాప్తు సాగాలని అధికారులపై ఒత్తిడి ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. అయితే తెలంగాణకు మారిన తరువాత కేసు విచారణలో పురోగతి కనిపించింది. తాజాగా కడప సెంట్రల్ జైల్ లోని కొంతమంది నిందితులను సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు నవీన్ మరోసారి విచారణ చేపట్టనున్నట్టు ఆయన లాయర్ కు ఇప్పటికే సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డికి  సీబీఐ నుంచి పిలుపు రావడం  సంచలనానికి కారణమవుతోంది.

మరోవైపు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆయన్ను కడపలోనే విచారించనున్నారు. అయితే సునీల్ యాదవ్ బెయిల్ పై  సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ తో దాదాపు కేసులో ఒక స్పష్టత వచ్చింది. చేసిందెవరు? చేయించిందెవరు? అన్న విషయాలను సీబీఐ స్పష్టం చేసింది. కూడా అప్పటి నుంచి కీలక వ్యక్తులకు నోటీసులిచ్చిన ప్రతీసారి అరెస్టులంటూ హడావుడి నడుస్తోంది. దీంతో రేపటి అవినాష్ రెడ్డి విచారణతో ఎటువంటి సంచలనాలు నమోదవుతాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read: Malla Reddy: వామ్మో.. మల్లన్న.. ఆయకు టికెట్‌ ఇస్తే అంతేనట!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular