Venu Swami – Chandrababu : వేణుస్వామి.. వివాదాస్పద జ్యోతిష్యుడు. సెలబ్రిటీల జాతకాలపై, వారి వ్యక్తిగత జీవితాలు, కెరీర్‌పై జ్యోతిష్యం చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇప్పటివరకు వేణు స్వామి చాలా మంది సెలెబ్రిటీలపై చెప్పిన జ్యోతిష్యాలు నిజమైనట్లు ప్రచారం ఉంది. సెలబ్రిటీల జాతకం మార్చేందుకు ఆయన పూజలు కూడా చేస్తుంటారు. ఇటీవల ఇండస్ట్రీలో ఓ హీరో చనిపోతాడని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే నందమూరి తారకరత్న చనిపోయాడు. తాజాగా 2023 ప్రభాస్‌కు అంతగా బాగా లేదన్నారు. ఆదిపురుష్ పెద్దగా హిట్ కాదని చెప్పారు. ఫలితం అలాగే ఉంది. ఇలా రాజకీయ నాయకులు జాతకాలు, సోషల్ మీడయాలో వీడియోలతో ఇటీవల వేణుస్వామి బాగా ఫేమస్ అయ్యారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌తోపాటు ప్రధాని నరేంద్రమోదీ భవిష్యత్ గురించి కూడా చెప్పారు. కేసీఆర్ ఎప్పటికీ ప్రధాని కాడని తెలిపారు. మోదీకి వచ్చే ఎన్నికల్లో కాస్త ఎదురుగాలి వీస్తుందని వెల్లడించారు.
తాజాగా బాబుతో వేణుస్వామి..
మరో పది నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి నేతలు కూడా వేణుస్వామితో జాతకం చెప్పించుకుంటున్నారు. ఇందుకోసం వేణుస్వామిని ఆశ్రయిస్తున్నారు. జాతకంలో దోషాలు పోగొట్టుకునేందుకు ప్రత్యేక పూజలు చేయాలని కోరుతున్నారు. తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా వేణుస్వామిని సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ విడియోలో ఎలాంటి వాయిస్ వినిపించడం లేదు. వీడియోలో మాత్రం చంద్రబాబుకు ఏదో పేపర్ అందించారు. అది ఆయన జాతక పత్రాలు అయి ఉంటాయని నెటిజన్లు పేర్కొటున్నారు. కొంతమంది ఈ వీడియో పాతదేమో అని అంటున్నారు. మరికొందరు స్వామీజీ.. బాబుగారు సీఎం అయ్యేలా చూడండి అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు.
జగనే మళ్లీ సీఎం అని..
ఇదిలా ఉంటే ఏపీకి జగనే మళ్లీ సీఎం అవుతారని కూడా వేణుస్వామి ఇదివరకే చెప్పారు. జాతకపరంగా వచ్చే ఎన్నికలు కూడా జగన్‌కు అనుకూలిస్తాయని తెలిపారు. గ్రహాలు, నక్షత్రాలన్నీ జగన్‌కు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేణుస్వామిని కలిసిన వీడియో వైరల్ కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
