https://oktelugu.com/

Heroine  Abhinaya: ఆ హీరోయిన్ కు మాటలు రావు.. చెవులు వినపడవు.. అయినా సింగిల్ టేక్ ఆర్టిస్ట్..!

Heroine  Abhinaya: సినిమాల్లో ఎంతో అనుభవం ఉన్నవారు కూడా.. చాలా సార్లు సరైన యాక్టింగ్ చేయలేరు. టేకుల మీద టేకులు తీసుకుంటూనే ఉంటారు. కానీ.. మాటలు రాని అమ్మాయి, చెవులు కూడా వినిపించని అమ్మాయి.. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోంది. Also Read: Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “క్యాలీ ఫ్లవర్” నుంచి స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన చిత్ర బృందం… ఆమె చేసే అభినయం చూస్తే.. అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఆ అద్భుతమైన […]

Written By:
  • Rocky
  • , Updated On : November 13, 2021 / 06:18 PM IST
    Follow us on

    Heroine  Abhinaya: సినిమాల్లో ఎంతో అనుభవం ఉన్నవారు కూడా.. చాలా సార్లు సరైన యాక్టింగ్ చేయలేరు. టేకుల మీద టేకులు తీసుకుంటూనే ఉంటారు. కానీ.. మాటలు రాని అమ్మాయి, చెవులు కూడా వినిపించని అమ్మాయి.. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా సత్తా చాటుతోంది.

    Also Read: Sampoornesh Babu: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు “క్యాలీ ఫ్లవర్” నుంచి స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన చిత్ర బృందం…

    ఆమె చేసే అభినయం చూస్తే.. అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఆ అద్భుతమైన నటి మరెవరో కాదు అభినయ. ఈమె పేరు చాలా మందికి తెలియకపోవచ్చుగానీ.. ఆమె ముఖాన్ని మాత్రం అంత త్వరగా ఎవ్వరూ మరచిపోలేరు. సూపర్ హిట్ మూవీ.. “శంభో శివ శంభో” చిత్రంలో రవితేజ చెల్లిగా నటించింది ఈమే! ఈ నటి పుట్టు మూగ, చెవిటి అంటే ఎవ్వరూ నమ్మలేరు. మరి, ఇలాంటి వైకల్యంతో చిత్ర పరిశ్రమలో ఎలా రాణిస్తోంది? అసలు ఎలా ప్రవేశించింది? అన్నది చూద్దాం.

    Also Read: NTR: ఆయనకు ఎన్టీఆర్ లో తన కొడుకు కనిపించాడు !

    abhinaya

    అభినయ తళనాడుకు చెందిన యువతి. పుట్టిన నాటి నుంచే చెవుడు, మూగ. వయసు పెరిగినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈమె తండ్రి సినిమాల్లో మామూలు క్యారెక్టర్ ఆర్టిస్టు. అయితే.. హైదరాబాద్ లో స్పీచ్ థెరపీ ఇప్పిస్తే.. మాటలు వచ్చే ఛాన్స్ ఉందని ఎవరో చెబితే.. 11 లక్షలు అప్పు చేసి మరీ.. చికిత్స చేయించారు. అయితే.. డబ్బులు ఖర్చయ్యాయి కానీ.. మాటలు మాత్రం రాలేదు. ఆ తర్వాత మళ్లీ తమిళనాడు వెల్ళిపోయారు. అయితే.. అభినయకు చిన్న నాటి నుంచే నటనపై ఇష్టం ఏర్పడింది. ఆమె వయసుతోపాటు ఆ కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. తండ్రి ఆమెను ఆడిషన్స్ కు కూడా తీసుకెళ్లేవారు. అయితే.. ఆమె రూపం చూసి చక్కగా ఉందని చెప్పినవారు.. ఆమె మూగ, చెవిటి అని తెలిసి ముఖం చిట్లించేవారు.

    ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఎక్కడా అవకాశం దక్కలేదు. దీంతో.. ఆమెను యాడ్స్ లో నటింపచేశాడు తండ్రి. అందులో మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుంది కాబట్టి.. కొన్నింటిలో మాటలతో పని ఉండదు కాబట్టి.. ఆ వైపు వెళ్లింది. చాలా యాడ్స్ లో కూడా నటించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అవకాశమే అభినయను వెతుక్కుంటూ వచ్చింది. ఒక తమిళ సినిమాలో నటించాల్సిన ముంభై భామ అర్థంతరంగా తప్పుకోవడంతో.. కొత్త ముఖాన్నే తీసుకోవాలని దర్శకుడు నిర్ణయించుకోవడంతో.. అనివార్యంగా అభినయకు ఆ చాన్స్ దక్కింది. అదే.. “శంభో శివ శంభో”.

    తమిళనాట హీరో చెల్లిగా చేసిన ఈ సినిమా.. అక్కడ సంచలన విజయం సాధించింది. ఎంతగా అంటే.. ఏకంగా 13 అవార్డులు కొల్లగొట్టిందీ సినిమా. ఇందులో అభినయ నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. ఇక్కడా సంచలన విజయం సాధించింది. దీంతో.. అభినయ అందరి దృష్టినీ ఆకర్శించింది. తమిళ నాట మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగులోనూ.. దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో నటించింది. నిజానికి అన్నీ సజావుగా ఉన్నవాళ్లే అవస్థలు పడుతుంటే.. వైకల్యాన్ని కూడా అధిగమించి శెభాష్ అనిపించుకోవడం మాటలా?? ఆ విధంగా తన పేరులోని అభినయాన్ని అద్భుతంగా పలికిస్తున్న అభినయ నిజంగానే సార్థక నామథేయురాలే.