Sentinelese Tribe: భారత దేశం ఒక స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉన్న దేశం. ఈ దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు. అయితే కొన్ని ప్రదేశాలకు వెళ్లడం సాధ్యం కాదంటున్నారు పర్యాటకులు. ఎందుకంటే దేశంలోని ఒక ద్వీపంలోకి వెళ్లడంపై నిషేధం ఉంది. ఎందుకంటే అక్కడ స్త్రీలు, పురుషులు నగ్నంగానే ఉంటారు. మరి ఆ ద్వీపం ఎక్కడ ఉంది. అక్కడకి ఎందుకు వెళ్లకూడదో తెలుసుకుందాం.
గిరిజన తెగలు..
ప్రపంచంలో చాలా తెగలు, గిరిజనులు ఉన్నారు. భిన్నమైన ఆచారాలు, నమ్మకాలు, జీవన శైలి కలిగి ఉంటారు. చాలా మంది గిరిజన జాతులు ఇప్పటికీ అడవుల్లోనే నివసిస్తున్నాయి. ఇప్పటికీ వారి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలోని ఓ రహస్య ప్రదేశంలో ఓ తెగ జీవనం సాగిస్తోంది. అక్కడ బయటి వ్యక్తుల ప్రవేశంపై పూర్తి నిషేధం ఉంది. ఈ పరిమితిని భారత ప్రభుత్వమే విధించింది. వాస్తవానికి, ఈ ద్వీపంలో ఒక గిరిజన సంఘం నివసిస్తుంది. వీళ్లకు నాగరికతతో సంబంధం లేదు. నేటికీ వారు పాత పద్ధతుల ప్రకారమే జీవిస్తున్నారు.
అందరూ నగ్నంగానే..
ఈ ద్వీపంలో నివసించే గిరిజనులు ఇప్పటికీ బట్టలు కట్టుకోరు. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అంతా నగ్నంగానే జీవనం సాగిస్తారు. ఈ తెగ ఉండే ద్వీపం పేరు సెంటినెల్ ద్వీపం. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది. సెంటినెల్ ద్వీపానికి ఇతరులు వెళ్లడం ప్రాణాంతకం కూడా.
వెళ్లినవారు తిరిగి రారు..
కొన్నేళ్ల క్రితం కొంతమంది విదేశీ పర్యాటకులు సెంటినెల్ ద్వీపానికి రహస్యంగా వెళ్లారు. కానీ, వారు సజీవంగా తిరిగి రాలేదు. వారి మృతదేహాలు ద్వీపం నుంచి బయటకు వచ్చాయి. ఇక సెంటినెల్ ద్వీపం చాలా అందంగా ఉంటుంది. అక్కడ నివసించే సెంటినెలీస్ తెగ అత్యంత ప్రమాదకరం. అందుకే ఆ ద్వీపాన్ని సందర్శించడాన్ని నిషేధించారు. సామాన్య ప్రజలు, పర్యాటకులే కాదు సైన్యం, ప్రభుత్వ అధికారులు కూడా అటు వెళ్లడం నిషేధం.
ఆధునిక యుగానికి దూరంగా..
పసిఫిక్ మహాసముద్రంలోని ఉత్తర సెంటినెల్ ద్వీపంలో నివసిస్తున్న రహస్య ఆదిమ తెగకు ఆధునిక ప్రపంచంతో సంబంధం లేదు. సమాజంలో ప్రజలు బయటి వ్యక్తులతో సంబంధాలు కొనసాగించరు. బయటి వ్యక్తులు కనిపిస్తే వారిపై తెగల ప్రజలు దాడిచేస్తారు. 2006లో కొందరు మత్స్యకారులు ఈ ద్వీపానికి చేరుకున్నారు. వారిని తెగవారు చంపేశారు. ఇక ఈ తెగవారు అగ్ని బాణాలు వేయడంతో నిపుణులు. ద్వీపంపై విమానం తక్కువ ఎత్తులో ఎగిరితే అగ్నిబాణాలతో దాడి చేస్తారు.
60 వేల ఏళ్లనాటిది..
సెంటినెల్ ద్వీపం ఎప్పుడూ అంతుపట్టని రహస్యంగానే ఉంది. ఈ తెగ 60 వేల ఏళ్లనాటిదని నమ్ముతారు. ప్రస్తుతం ద్వీపంలో ఉన్న తెగ మొత్తం జనాభా గురించిన సమాచారం లేదు. అంచనాల ప్రకారం 100 నంచి 200 ఉంటుంది. వారి ఆచార వ్యవహారాలు, భాష, జీవన విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాటి గురించి కూడా బయటి ప్రపంచానికి తెలియదు.