Homeఎంటర్టైన్మెంట్Singer Dhee: దసరా మూవీ : సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ‘చమ్కీల అంగీలేసి’ సింగర్‌.....

Singer Dhee: దసరా మూవీ : సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న ‘చమ్కీల అంగీలేసి’ సింగర్‌.. ఆమె ఎవరో తెలుసా!?

Singer Dhee
Singer Dhee

Singer Dhee: అచ్చమైనా నాటు పదాలతో చంద్రబోస్‌ రాసిన నాటు.. నాటు.. పాట ఆస్కార్‌ అందుకుని విశ్వవ్యాప్తంగా మరోమారు అందరితో నాటు స్టెప్పులు వేయిస్తోంది. వయసు, హోదాతో సంబంధం లేకుండా నాటు డ్యాస్స్‌తో అదరగొడుతున్నారు. నాటు.. నాటు.. ఊపులో కూడా ఓ విచిత్రమైన వాయిస్‌ ఇప్పుడు తెలుగు ప్రజానీకాన్ని ఉర్రూతలూగిస్తోంది. సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఆ వాయిస్‌ ఎవరిదో కాదు.. నాని, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన ‘దసరా’ చిత్రంలో ‘చమ్కీల అంగీలేసి’ పాట పాడిన సింగర్‌ దీక్షిత అలియాస్‌ ధీ ది. వాస్తవానికి ఆమె కొత్త గాయని కాదు. సూపర్‌ డూపర్‌ హిట్స్‌ సాంగ్స్‌ పాడిన తమిళ గాయని. ఆ పాటలేంటో తెలిస్తే అవి పాడింది ధీ యేనా? అని ఆశ్చర్యపోతారు.

14వ ఏట నుంచే పాటలు..
సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ మూవీ.. ‘ఆకాశం నీ హద్దు రా’ లో కాటుక కనులే సాంగ్‌ పాడింది కూడా ధీ నే. ఇక అలాగే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను పొందిన రౌడీ బేబీ సాంగ్‌ కూడా ధీ గళం నుంచి జాలువారిందే. సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌ కుమార్తెనే ఈ ధీ.. ఆమె పాడిన పాటలన్నీ బాగా క్లిక్‌ అయ్యాయి. 14 ఏళ్ల వయసు నుంచే ధీ పాటలు పాడడం ప్రారంభించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ గాయని ఆస్కార్‌ విజేత ఏఆర్‌.రెహమాన్‌తో తన మొదటి పాప్‌ ఆల్బమ్‌ను రూపొందించింది. ఇక అక్కడి నుంచి ఆమె పాడిన ప్రతీపాట వైరల్‌ అవుతోంది.

దసరాలో కూతురుతో పాట..
దసరా మూవీకి ధీ తండ్రి సంతోష్‌ నారాయణన్‌ సంగీత దర్శకత్వం వహించారు. ఆమె తన తండ్రి స్వరపరచిన ఎన్నో పాటలను పాడింది. తెలంగాణ యాసలో ఇంతటి కష్టమైన, టఫ్‌ పాట పాడినందుకు ఈ తమిళ గాయని పెద్ద ఎత్తున ప్రశంసలు అందుకుంటోంది.

Singer Dhee
Singer Dhee

పాష్‌ లుక్స్‌తో..
ఇక ధీని చూస్తే చాలా పాష్‌గా అనిపిస్తోంది. అలాంటి ధీ.. ఒక తెలంగాణ యాసతో ఉన్న పాటను పాడటం విశేషం. ఈ పాటను కాసర్ల శ్యామ్‌ స్వచ్ఛమైన తెలంగాణ యాసలో రాయగా, రామ్‌ మిరియాల, ధీ కలిసి పాడారు. ఇప్పుడు ఈ పాట సోషల్‌ మీడియాలో దుమ్ము రేపుతోంది. పాష్‌ లుక్స్‌తో ధీ పాట పాడుతున్న వీడియోతోపాటు, కీర్తి సురేశ్‌ స్టెప్పులు వేస్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికీ యూట్యూబ్‌లో దేశవ్యాప్తంగా టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆమె వైపే చూస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version