Niagara Falls: నయాగరా జలపాతం ఎన్నెన్నో ప్రత్యేకతల సమాహారం. హనీమూన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా ఈ జలపాతాన్ని పిలుస్తారు. ఏటా 12 మిలియన్ల మంది సందర్శకులు ఈ జలపాతానికి చూడడానికి వస్తుంటారు. ఇవి మూడు జలపాతాల కలయిక. ఇందులో అమెరికన్ వాటర్ ఫాల్స్, బ్రైడల్ వీల్ ఫాల్స్, కెనడియన్ ఫాల్స్ ఉన్నాయి. నయాగరా జలపాతం నుంచి ప్రతి సెకనుకు దాదాపు 28 మిలియన్ లీటర్లు లేదా ఏడు లక్షల గ్యాలన్ల నీరు ప్రవహిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా కదిలే జలపాతం ఇది.
నయాగరా జలపాతం పై 1881లో మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి 4.9 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. నయాగరా జలపాతం వయస్సు కేవలం 12 వేల సంవత్సరాలు మాత్రమే. భూమిపై ఉన్న ఇతర స్వరూపాలతో పోల్చితే నయాగరా జలపాతం చాలా చిన్నది. దీన్ని చూసేందుకు నిత్యం వేలాదిమంది పర్యటకులు వస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజల్లో 20 శాతం మంది తాగే నీటిని నయాగరా జలాపాతమే అందిస్తుంది.
వేసవి సమయంలో నయాగరా జలపాతం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. రాత్రి వేళల్లో అయితే విద్యుత్ దీపాలంకరణలో మెరిసిపోతుంది. అమెరికాలో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా నయాగరా జలపాతం విరాజిల్లుతుంది. నిత్యం వేలాది సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ప్రత్యేక ఫ్లడ్ లైట్ల వెలుతురులో నయాగరా జలపాతం మెరిసిపోతూ ఉంటుంది. ఆ సమయంలో జలపాతం చూడడానికి రెండు కళ్ళు చాలవు. ప్రపంచపుటల్లో పర్యాటక రంగంలో అమెరికా ఉండడానికి ఈ జలపాతం కూడా ఒక కారణం.