
Director Rajamouli Love Story: సినిమా సినిమాకు తన స్థాయి పెంచుకుంటూ వెళుతున్నారు రాజమౌళి. బాహుబలి రేంజ్ మూవీ ఆయన నుండి ఇక రాదనుకుంటే ఆర్ ఆర్ ఆర్ తో అంతకు పదిరెట్లు అనుభూతి ఇచ్చారు. బాహుబలితో ఇండియా వైడ్ మోత మోగించిన రాజమౌళి, ఆర్ ఆర్ ఆర్ తో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గోల్డెన్ గ్లోబ్ కొల్లగొట్టి ప్రతిష్టాత్మక ఆస్కార్ వైపు పరుగులు తీస్తున్నారు. మార్చి 12న జరిగే ఆస్కార్ అవార్డుల వేడుకలో అద్భుతం జరగడం ఖాయం అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇండియన్ ఆడియన్స్ ఆస్కార్ డే కోసం ఎదురుచూస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించడం ఖాయమని జనాలు నమ్ముతున్నారు. మరి రాజమౌళి ఈ స్థాయికి రావడానికి కారణం… ఆయన పట్టుదల, కృషి మాత్రమే. సినిమానే ప్రపంచంగా బ్రతికేస్తారు. ప్రేక్షకుడిగా తన సినిమాను తాను ఒకటికి పదిసార్లు మనసులో ఆస్వాదిస్తాడు. రాజమౌళి ప్రతి సన్నివేశం తెరకెక్కించే ముందు… థియేటర్లో ప్రేక్షకుడిలా ఆలోచిస్తాడట. అందుకే ఆయనకు ఆడియన్స్ నాడీ బాగా తెలుసు.
ఇంత పెద్ద టాప్ డైరెక్టర్ అయినప్పటికీ ఆయన మీద ఎలాంటి బ్యాడ్ రూమర్స్ రాకపోవడం విశేషం. ఎందరో సుందరాంగులతో పని చేసినప్పటికీ రాజమౌళి ఎవరికీ టెంప్ట్ కాలేదు. వృత్తిని గౌరవించి తన మనసు సినిమా మీద నుండి మళ్లకుండా నిగ్రహంగా ఉన్నారు. అయితే దర్శకుడు కాక ముందు మాత్రం ఆయనకు కూడా లవ్ స్టోరీలు ఉన్నాయట. ఇద్దరు అమ్మాయిలతో ఆయన ప్రేమించి విఫలం చెందారట. ఇక రమా రాజమౌళిని కూడా ఆయన ప్రేమించే పెళ్లి చేసుకున్నారట.
గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి తన ప్రేమ కథల గురించి నోరు విప్పారు. దర్శకుడు కాకముందు చాన్నాళ్ల క్రితం ఇద్దరు అమ్మాయిలను ప్రేమించాను. ఆ ప్రేమల విషయంలో నేను వైఫల్యం చెందాను. ఇక రమా రాజమౌళి మా బంధువులు అమ్మాయి. మా వదినకు చెల్లెలు అవుతారు. ఆమె చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వందకు రెండు వందల శాతం నేను లాయల్ భర్తను అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఒకవేళ రాజమౌళి ప్రేమించిన అమ్మాయిలు ఆయన ప్రేమను ఒప్పుకుని ఉంటే వాళ్ళ జీవితం మారిపోయి ఉండేది. అదే సమయంలో రమా రాజమౌళి వంటి బెస్ట్ పార్ట్నర్ ని ఆయన కోల్పోయేవారు. అంటుంటారు కదా… పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయని. రాజమౌళి ప్రతి సినిమాకు రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తారు. ఆ ఫ్యామిలీ మొత్తం సినిమాకే అంకితం అవుతారు. కీలమైన సగం డిపాట్మెంట్స్ వారివే కావడం విశేషం.