https://oktelugu.com/

Aruna Bhikshu: హీరో నాని బామ్మ బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదే… స్టార్ కిడ్స్ సితార, అర్హ ఆమె స్టూడెంట్స్ అని మీకు తెలుసా!

Aruna Bhikshu: అంటే సుందరానికీ మూవీలో నాని బామ్మగా చేశారు అరుణ బిక్ష. సనాతన బ్రాహ్మణ మహిళగా ఆమె నటన చాలా సహజంగా సాగుతుంది. బామ్మ పాత్రలో అరుణ బిక్ష ఆకట్టుకున్నారు. అయితే ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఆరాతీస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. అరుణ బిక్షకు కొన్ని కళల్లో ప్రావీణ్యం ఉంది. అరుణ బిక్ష యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎస్సెన్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2022 / 12:58 PM IST
    Follow us on

    Aruna Bhikshu: అంటే సుందరానికీ మూవీలో నాని బామ్మగా చేశారు అరుణ బిక్ష. సనాతన బ్రాహ్మణ మహిళగా ఆమె నటన చాలా సహజంగా సాగుతుంది. బామ్మ పాత్రలో అరుణ బిక్ష ఆకట్టుకున్నారు. అయితే ఈమె గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఆమె బ్యాక్ గ్రౌండ్ ఆరాతీస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. అరుణ బిక్షకు కొన్ని కళల్లో ప్రావీణ్యం ఉంది. అరుణ బిక్ష యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎస్సెన్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. ఆమె డాన్స్ టీచర్ గా ఉన్నారు.

    Aruna Bhikshu

    మన టాలీవుడ్ స్టార్ కిడ్స్ సితార, అర్హ ఆమె శిష్యులే. వారిద్దరికీ అరుణ బిక్ష నాట్యం, నటనలో శిక్షణ ఇస్తున్నారు. అరుణ బిక్షకు కూచిపూడి నాట్యంలో ప్రావీణ్యం ఉంది. అటు హైదరాబాద్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేస్తూనే ఇటు నటన కొనసాగిస్తున్నారు. అంటే సుందరానికీ మూవీలో బామ్మ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు. అరుణ బిక్షుకు, సితార, అర్హ బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం. అర్హ సోషల్ మీడియాలో అరుణ బిక్షను ఉద్దేశిస్తూ పోస్ట్ చేసిన వీడియో ప్రత్యేకంగా వైరల్ గా మారింది.

    అర్హ ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అర్హ నటించారు. దీని కోసం అర్హ నటనలో అరుణ బిక్ష దగ్గరే శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు సితార నటిగా వెండితెరకు పరిచయమయ్యేందుకు సిద్ధం అవుతున్నారు. సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన సింగింగ్, డాన్సింగ్ వీడియోలు ఆమె షేర్ చేస్తూ ఉంటారు.మహేష్ లేటెస్ట్ రిలీజ్ సర్కారు వారి పాట చిత్రంలో సితార పెన్నీ సాంగ్ ప్రోమోలో కనిపించిన విషయం తెలిసిందే.

    Aruna Bhikshu

    ఇక అంటే సుందరానికీ సినిమా తర్వాత అరుణ బిక్ష మరలా కనిపించలేదు. అంటే సుందరానికీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా ఆడలేదు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటించారు. అంటే సుందరానికీ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

    Tags