
Sathyaraj Daughter: నాలుగు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు సత్యరాజ్. హీరోగా, విలన్ గా , కమెడియన్ గా విలక్షణ పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు. తమిళంతో పాటు ఆయనకు తెలుగులో కూడా భారీ డిమాండ్ ఉంది. బాహుబలి సిరీస్ తో ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్నారు. బాహుబలి అనుచరుడు కట్టప్ప పాత్ర ఆయనకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న పార్ట్ 1 విడుదల తర్వాత పెద్ద ఎత్తున ట్రెండ్ అయ్యింది. పార్ట్ 2 మీద ఆసక్తి క్రియేట్ చేసింది.
నటుడు సత్యరాజ్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన పిల్లలు కూడా గొప్పోళ్లే. కొడుకు శిబి సత్యరాజ్ తండ్రి వారసత్వం అందుకొని నటుడయ్యాడు. కోలీవుడ్ లో హీరోగా చిత్రాలు చేస్తున్నారు. శిబి స్టార్ గా ఎదగపోయినా ఆ ప్రయత్నంలో అయితే ఉన్నాడు. 2003 నుండి శిబి హీరోగా చిత్రాలు చేస్తున్నారు. అయితే సత్యరాజ్ కూతురు దివ్య సత్యరాజ్ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
దివ్య ప్రముఖ న్యూట్రిషనిస్ట్. సోషల్ యాక్టివిస్ట్. పలు సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మద్రాస్ యూనివర్సిటీ లో మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇన్ న్యూట్రిషన్ లో డిగ్రీ చేశారు. ఆమె విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. పిల్లల ఆరోగ్య సమస్యలు, చైల్డ్ లేబర్, ఉమన్ సెల్ఫ్ డిఫెన్స్ విషయాలపై వర్క్ షాప్స్ నిర్వహిస్తూ ఉంటారు. శ్రీలంక శరణార్థులు కోసం ఆమె అనేక సేవా కార్యక్రమాలు తలపెట్టారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ కి దివ్య గుడ్‌విల్ అంబాసిడర్ గా ఉన్నారు. నలుగురు యువతులను దివ్య దత్తత తీసుకున్నారు. మెడికల్ మాఫియాపై ఆమె గళమెత్తారు.

ఆమె చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా పలు గౌరవాలు దక్కాయి. అవార్డ్స్, రికార్డ్స్ తో సత్కరించారు. దివ్య సత్యరాజ్ కి ఇంకా వివాహం కాలేదు. చక్కని రూపం ఉన్నప్పటికీ సమాజానికి సేవ చేయాలనే తపనతో సినిమా వైపు వెళ్ళలేదు. ఆమె సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. సత్యరాజ్ గర్వపడే కూతురిగా దివ్య ఉన్నత భావాలతో నలుగురుకి స్ఫూర్తినిచ్చే స్థాయిలో ఉన్నారు. అన్నయ్య శిబి, నాన్న సత్యరాజ్ సినిమాల్లో రాణిస్తుండగా… దివ్య మాత్రం సామాజ సేవకురాలిగా మరింత కీర్తి ఆర్జిస్తున్నారు. ఇక సత్యరాజ్ గత ఏడాది రాధే శ్యామ్, పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటించారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి తండ్రి పాత్ర చేశారు.