https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Final : రేవంత్ కి అన్యాయం..ప్రేక్షకుల ఓటింగ్స్ ని బిగ్ బాస్ ఎలా తారుమారు చేసిందో చూడండి..ప్రూఫ్స్ ఇదే

Bigg Boss 6 Telugu Final : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఈరోజు ముగిసింది.. టైటిల్ విన్నర్స్ గా శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరు నిలిచారు..చివరి నిమిషం లో నాగార్జున ఇచ్చిన 40 లక్షల ఆఫర్ ని శ్రీహాన్ తీసుకోగా, మిగిలిన పది లక్షలు..మారుతీ సుజుకీ బ్రేజా కారు, మరియు 25 లక్షల రూపాయిలు విలువ చేసే ఫ్లాట్ రేవంత్ గెలుచుకున్నాడు..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం రేవంత్ గెలిచాడని అందరూ అనుకున్నారు..కానీ చివరి నిమిషం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 18, 2022 / 11:11 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Final : బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ఈరోజు ముగిసింది.. టైటిల్ విన్నర్స్ గా శ్రీహాన్ మరియు రేవంత్ ఇద్దరు నిలిచారు..చివరి నిమిషం లో నాగార్జున ఇచ్చిన 40 లక్షల ఆఫర్ ని శ్రీహాన్ తీసుకోగా, మిగిలిన పది లక్షలు..మారుతీ సుజుకీ బ్రేజా కారు, మరియు 25 లక్షల రూపాయిలు విలువ చేసే ఫ్లాట్ రేవంత్ గెలుచుకున్నాడు..ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం రేవంత్ గెలిచాడని అందరూ అనుకున్నారు..కానీ చివరి నిమిషం లో అక్కినేని నాగార్జున ఇచ్చిన ట్విస్ట్ కి కంటెస్టెంట్స్ మరియు ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అయ్యింది.

    స్వల్ప ఓట్ల మార్జిన్ తో ప్రేక్షకుల ఓటింగ్ శ్రీహాన్ కి ఎక్కువ ఉండింది అట.. ఇది నిజంగా నమ్మేటట్టు ఎవరికీ అనిపించడం లేదు. .రేవంత్ కూడా అది విని షాక్ కి గురయ్యాడు.. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి.. శ్రీ సత్య అయితే ఆశ్చర్యపోయి నోటి మీద చెయ్యి వేసుకుంది.. ఎందుకంటే ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం సోషల్ మీడియా లో ఉన్న అన్ని వెబ్ సైట్స్ పోలింగ్స్ ఆధారంగా తీసుకొని చూస్తే రేవంత్ కి అత్యధిక ఓట్లు వచ్చాయి.

    ముందుగా నాగార్జున ఇచ్చిన ఆఫర్ ని శ్రీహాన్ మరియు రేవంత్ ఒప్పుకోరు ..ఆ తర్వాత నాగార్జున కంటెస్టెంట్స్ అందరిని అభిప్రాయం అడుగుతారు..అందరూ శ్రీహాన్ ని నాగార్జున ఇచ్చిన ఆ ఆఫర్ ని తీసుకోమని చెప్తారు..రేవంత్ కి ఒక్కరు కూడా చెప్పరు..ఎందుకంటే అతను టైటిల్ విన్నర్ అని అందరికి తెలుసు..ఎందుకంటే బయట ఉన్న వాతావరణం అందరికీ తెలుసు కాబట్టి..కానీ ఇలా శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయి అని చెప్పడం మాత్రం విడ్డూరం గా అనిపించింది..కానీ ఇద్దరికీ సరిసమానంగా రావాల్సినవి వచ్చాయి కాబట్టి అందరూ సంతోషించారు.

    ఇద్దరు అర్హులే..బిగ్ బాస్ హౌస్ లో మొదటి రోజు నుండి ఎంటర్టైన్మెంట్ పంచడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది వీళ్ళే.. శ్రీహాన్ ఒకవేళ ఆ 40 లక్షలు తీసుకోకపోయి ఉంటే రేవంత్ కి అసలు చిల్లి గవ్వ కూడా దక్కేది కాదు.. ఇక బిగ్ బాస్ యాజమాన్యం అయితే ఆ నెగటివిటీ ని తట్టుకోలేకపోయేవారు..మొత్తానికి ఫినిషింగ్ ఇలా ఊహించని ట్విస్టులతో సమాప్తం అయ్యింది.