Indore Husband And Wife: ఫేస్ బుక్ లో రకరకాల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసుకుంటున్నారు. ఫేస్ బుక్ లో ఫొటోలు పెట్టి ఎదుటి వారిని భ్రమలో పడేస్తున్నారు. ఫేస్ బుక్ లో హీరోయిన్ల ఫొటోలు పెడుతూ మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండోర్ లో జరిగిన ఓ సంఘటన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ మహిళ ఫేస్ బుక్ లో ఏంజిల్ ప్రియ పేరుతో ఓ అకౌంట్ క్రియేట్ చేసుకుంది. దీంతో ఆమెకు తెలియకుండానే తన భర్తకే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య కొన్నాళ్లు ఆసక్తికర సంభాషణలు చోటుచేసుకున్నాయి. కొన్నాళ్లకు విషయం తెలియడంతో షాక్ కు గురయ్యారు.

ఇండోర్ కు చెందిన ఓ మహిళ తనకంటే పదేళ్లు వయసులో పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా ఉద్యోగం ఉందనే కారణంతో అతడితో వివాహానికి సిద్ధమైంది. పెళ్లి తరువాత ఆమె జీవితం ఎంతో ఊహించుకున్నా చివరకు నిరాశే మిగిలింది. శాడిస్టు భర్తతో వేగలేకపోయింది. నిత్యం చిత్ర హింసలకు గురిచేయడం అతడికి అలవాటుగా మారింది. తరచూ కొట్టడం, హింసించడం, మత్తు పదార్థాలు తాగించడం వంటి చేష్టలతో విసిగించేవాడు. ఇలా బాధలకు గురైన ఆమె మూడేళ్ల క్రితం అతడి నుంచి దూరంగా జరిగింది. అతడిపై వేధింపుల కేసు పెట్టింది.
అదివరకే వీరికి ఓ కొడుకు పుట్టాడు. దీంతో పిల్లవాడిని తన దగ్గర ఉంచుకుని భార్యను మాత్రం వదిలేశాడు. కొడుకును చూడటానికి కూడా అనుమతించేవాడు కాదు. భర్త నుంచి విడిగా ఉంటున్నందున భరణం ఇవ్వాలని ఆమె దరఖాస్తు చేసుకున్నా ఆమెకు న్యాయం జరగడం లేదు. దీంతో ఆమె ఏంజెల్ ప్రియ అనే పేరుతో ఫేస్ బుక్ లో క్రియేట్ చేసుకోవడంతో అతడు ఆమెతో తరచూ మాట్లాడుతుండేవాడు. ఈ నేపథ్యంలో అతడు తన వయసును చెప్పేయడంతో ఆమె ఆశ్చర్యపడింది.

తనకంటే వయసులో 15 ఏళ్లు పెద్దవాడిగా గుర్తించింది. అతడితో చాటింగ్ చేసిన స్క్రీన్ షాట్లు తీసి పంపించడంతో బాగోతం బయటపడింది. ఇన్నాళ్లు తాను చాటింగ్ చేసింది తన భర్తతోనేనా అనే అనుమానం ఆమెకు కలిగింది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. భార్యను వేధిస్తున్న అతడికి బుద్ది చెప్పి ఆమెకు సరైన న్యాయం జరిగితే బాగుంటుందనే అభిప్రాయాలు నెటిజన్లలో వస్తున్నాయి. ఫేస్ బుక్ పరిచయం కాస్త భార్యాభర్తల్లో చాటింగ్ కు దారి తీయడం విధి ఆడిన నాటకంగానే అభివర్ణిస్తున్నారు.