Nafithromycin : కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ కనిపెట్టి ప్రపంచ దేశాలకు సరఫరా చేసి భారత్ అనేక కీర్తి ప్రతిష్టలను గడించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సరికొత్త యాంటీబయాటిక్ ను కనిపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు నివారణకు అజిత్రోమైసిన్ అనే యాంటీబయాటిక్ వాడుతున్నారు. వైద్యులు కూడా దీనినే సిఫారసు చేస్తున్నారు. అయితే రోజురోజుకు వైరస్ లు సరికొత్త సంక్రమణను రూపొందించుకోవడంతో యాంటీబయాటిక్స్ కూడా ఆశించినంత స్థాయిలో పనిచేయడం లేదు. దానివల్ల మందులు వాడుతున్నప్పటికీ రోగులకు సాంత్వన కలగడం లేదు. పైగా అదేపనిగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంపై దుష్పరిణామాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక పరిశోధనల తర్వాత భారత్ అజిత్రోమైసిన్ కంటే అత్యంత శక్తివంతమైన యాంటీబయాటిక్ ను రూపొందించింది. దీనిని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (BIRAC) మద్దతు ప్రకటించింది. యాంటీబయాటిక్ తయారుచేసిన Wock hardit కంపెనీకి 8 కోట్ల వరకు సహాయం అందించింది. అయితే ఈ యాంటీబయటిక్ తయారు చేయడానికి wock hard it అనే కంపెనీ 500 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. 14 సంవత్సరాల నుంచి ఈ యాంటీబయాటిక్ తయారు చేయడానికి పరిశోధనలు చేస్తోంది. పరిశోధనలు పూర్తయిన తర్వాత అమెరికా, యూరప్, భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. అయితే ఈ ఔషధం ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఆమోదం కోసం వేచి ఉంది.
ఆ యాంటి బయోటిక్ పేరు ఏంటంటే..
వక్ హార్డ్ ఇట్ కంపెనీ రూపొందించిన ఆ యాంటీబయాటిక్ పేరు నాఫిత్రోమైసిన్. దీనిని న్యూమోనియా నివారణకు వాడుతుంటారు. మొన్నటిదాకా అజిత్రోమైసిన్ ను న్యూమోనియా నివారణకు వాడేవారు. అయితే కోవిడ్ తర్వాత సంభవించే న్యూమోనియా కేసులు అజిత్రోమైసిన్ వాడినప్పటికీ తగ్గడం లేదు. ఈ క్రమంలో నా ఫిత్రోమైసిన్ న్యూ మోనియా కు సమర్థవంతంగా అడ్డుకట్ట వేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది కమ్యూనిటీ అక్వైడ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా(CABP) ని సమర్థవంతంగా అడ్డుకుంటుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది ప్రాణాంతకమైన న్యూమోనియా అని.. దాని వల్ల ఊపిరితిత్తులకు వీపరితమైన ఇన్ ఫెక్షన్ సోకుతుందని.. అజిత్రోమైసిన్ వల్ల అది తగ్గదని చెబుతున్నారు.. మరో వైపు నా పిత్రోమైసిన్ ను ఆయుష్మాన్ భారత్ పథకంలో చేర్చాలని కేంద్రం యోచిస్తోంది. ఇది యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కు వ్యతిరేక పోరాటంలో ముందడుగు వేసేలా చేస్తుందని భారత వైద్యశాఖ అభిప్రాయపడుతోంది. ” గడచిన మూడు దశాబ్దాల కాలంలో శ్వాస కోశ సంబంధిత వ్యాధులను నివారించడానికి కొత్త యాంటీబయాటిక్ ను పరిశోధకులు సృష్టించలేదు. అజిత్రోమైసిన్ తో పోల్చి చూస్తే నా ఫిత్రోమైసిన్ ఎన్నో రెట్లు శక్తివంతమైనది. దీనిని మూడు రోజులకు ఒకసారి తీసుకోవాలి. ఇది ఊపిరి తిత్తుల్లో ఏర్పడిన ఇన్ ఫెక్షన్ ను నివారిస్తుంది. ప్రాణాంతకమైన న్యూమోనియాలను తగ్గిస్తుంది. దీనికి 96.7% క్లినికల్ క్యూర్ రేటు ఉందని” శాస్త్రవేత్తలు చెబుతున్నారు.