Homeట్రెండింగ్ న్యూస్Indian Food: మనం అత్యంత ఇష్టపడే ఈ 6 ప్రసిద్ధ వంటకాలు మన దేశానికి...

Indian Food: మనం అత్యంత ఇష్టపడే ఈ 6 ప్రసిద్ధ వంటకాలు మన దేశానికి చెందినవి కావు.. ఎక్కడ పుట్టాయో తెలుసా?

Indian Food: మంచి ఆహారం అంటే ప్రపంచాలన్నీ భారత్ వైపే చూస్తాయి. ఇక్కడ లభించే రుచికరమైన పదార్థాలు ఎక్కడా లభించనవి కొందరి అభిప్రాయం. ఇండియా నుంచి వెళ్లిన విదేశాల్లో సెటిలైనా.. భారతీయ వంటకాలను మరిచిపోరు. ఇటీవల అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్నారంటే.. వారు ఇక్కడి ఫుడ్ ను మరచిపోలేదని అర్థమవుతోంది. భారతీయ వంటకాలు విదేశాలకు ఎలా వెళ్లాయో.. విదేశీ రుచులను మనవాళ్లు బాగా ఆదరించారు. అంతేకాకుండా సాధారణ ఫుడ్ కంటే ఎక్కువే వాటిని లాగించేస్తున్నారు. రోజూవారీ చూసే స్నాక్స్ తో సహా ఇక్కడివి కావంటే ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి 6 ఇండియన్ కాని ఫుడ్ గురించి తెలుసుకుందాం..

ఇడ్లీ (Idly):
ప్రతిరోజూ ఇంట్లోనూ, హోటళ్లలోనూ తప్పనిసరిగా ఉండే ఆహార పదార్థం ఇడ్లీ. ఎలాంటి వెయిట్ పెరగకుండా ఆరోగ్యకరమైన ఇడ్లీనే ఎక్కువగా తినాలని వైద్యలు రెఫర్ చేస్తుంటారు. మనకు ఏదైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇడ్లికి మించిన ఫుడ్ మరొకటి ఉండదు. అయితే ఇడ్లీ తమిళనాడు నుంచి ఆంధ్రాకు వచ్చింది. కానీ అంతకుముందు ఇది ‘ఇండోనేషియా’లో పుట్టింది. అక్కడి నుంచి నుంచి కొందరు ఇండియాకు దీనిని తీసుకొచ్చారు.

సమోసా (Samosa):
సమోసా గురించి తెలియని వారుండరు. సాయంత్రం స్నాక్స్ అనగానే సమోసానే గుర్తుకు వస్తుంది. సమోసా వంటకం ఇరాన్ లో పుట్టింది. సంబుసక్ అనే హిందీ పదం నుంచి సమోసా పదాన్ని వాడుతున్నారు. ఇరాన్ లో తయారు చేసే సమోసాలో మాంసాన్ని కలుపుతూ ఉంటారు. కానీ మనదేశంలో ఆలుగడ్డను పెట్టి తయారు చేస్తారు. అన్ని రకాల వారు తినాలనే ఉద్దేశంతో అలా చేశారు.

రాజ్మా (Rajmah) :
రాజ్మా గురించి సౌత్ పీపుల్స్ కు పెద్దగా తెలియదు. కానీ ఉత్తరభారత్ లో ఇది ఫేమస్ వంటకం. ముఖ్యంగా పంజాబీ వాళ్లు దీనిని లోట్టలేసుకొని తింటారు. కొందరు దీనిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు. హోటళ్లలో దీనిని స్పెషల్ గా వడ్డీస్తారు. రాజ్మా మెక్సికోలో పుట్టింది. అక్కడి నుంచి దీనిని నావికులు ఉత్తర అమెరికాకు, ఆ తరువాత ఐరోపాకు తీసుకెళ్లి.. ఇక్కడికి తీసుకొచ్చారు.

జిలేబి (Jelebi):
బెంగాల్ లో జిలాపి, అస్సాంలో జిలేపి అనే పిలిచే ఈ స్వీట్ పదార్థం తొలిసారిగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో తయారు చేశారు. దీని గురించి అరేబియా వంటల పుస్తకం ‘కితాబ్ ఆల్ తనిఖ్’ లో రచించారు. అక్కడ అరబిక్ భాషలో జలాబీహ్ అని పిలుస్తారు. ఏదైనా తీపి వార్త చెప్పేటప్పుడు జిలేబిని కచ్చితంగా కొనుగోలు చేస్తారు.

గులాబ్ జామ్ (Gulab Jamun):
గోధుమతో తయారు చేసే గులాబ్ జాబ్ అంటే ఇష్టపడని వారుండరు. దీనిని మొదటగా టర్కీలో తయారు చేశారు. అక్కడి నుంచి భారత్ కు తీసుకొచ్చారు. ‘గులాబ్ జామున్ అనే పదం నుంచి గోల్ ఆబ్ అనే పర్షియన్ పదాల నుంచి గులాబ్ జామ్ అనే పేరు ఉద్భవించింది.

నాన్ (Naan):
రెస్టారెంట్లలో ఎక్కువగా లభించే నాన్ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని మొదట్లో మొఘలులు తయారు చేసుకునేవారు. ఆ తరువాత వారు భారత్ లోకి వచ్చిన సందర్భంగా ఈ వంటకాన్ని తీసుకొచ్చారు. వీటితో పాటు కర్రిని వేసుకొని లొట్టలేసుకొని తింటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
RELATED ARTICLES

Most Popular