Champions Trophy 2025 (7)
Champions Trophy 2025: ఈ టోర్నీ లో మ్యాచ్ లను కరాచీ, రావల్పిండి, లాహోర్ లో పాక్ మ్యాచ్ లను నిర్వహిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఇటీవల కరాచీ మైదానంలో జరిగిన సంఘటన వివాదానికి దారి తీసింది. భారత జాతీయ జెండాను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ స్టేడియంలో ప్రదర్శించలేదు. దీంతో పాకిస్తాన్ తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మీడియా లో, సోషల్ మీడియాలో పాక్ కు వ్యతిరేకంగా వార్తలు ప్రసారమయ్యాయి. పోస్టులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan cricket board) తలవంచక తప్పలేదు. దిద్దుబాటు చర్యలలో భాగంగా కరాచి స్టేడియంలో భారత జాతీయ పతాకాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ దర్శనమిస్తోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే 8 జట్ల జాతీయ పతాకాలలో భారత్, బంగ్లాదేశ్ మినహా.. మిగతా వాటి జెండాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రదర్శించింది.. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించక తప్పలేదు..” ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ మ్యాచ్ లు ఆడేందుకు పాకిస్తాన్ రావడం లేదు. కరాచీ, లాహోర్, రావల్పిండి ప్రాంతాలలో మ్యాచ్ లు ఆడుతున్న జట్ల జెండాలను మాత్రం ప్రదర్శించాం. భారత్ దుబాయ్ వేదికగా మ్యాచ్లు ఆడుతోంది. బంగ్లాదేశ్ ఇంతవరకు పాకిస్తాన్ రాలేదు. బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్ ను భారత గట్టుతో దుబాయ్ లో ఆడుతుంది కాబట్టి.. ఆ రెండు దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలను ప్రదర్శించలేదు.. పాకిస్తాన్ వచ్చిన మిగతా జట్ల పతాకాలు మాత్రం ఆయా స్టేడియాలలో దర్శనమిస్తాయి.. దీని గురించి మేము ఎవరికి ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్రికెట్ విస్తృతి కోసం మేము కృషి చేస్తున్నాం. నాకు సహకరించే జట్లకు గౌరవం అందిస్తాం. మా దేశ సార్వభౌమాధికారానికి ఇబ్బంది కలిగించే విషయాలను మేము పట్టించుకోమని” పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వర్గాలు ప్రకటించాయి.
వివాదం అంతకంతకు పెరగడంతో
భారత జాతీయ జెండాను ప్రదర్శించకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో ఈ వివాదాన్ని మరింత పెద్దది చేసే దానికంటే.. ముగింపు పలకడమే మంచిదని ఐసీసీ నుంచి ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తలవంచక తప్పలేదు. కరాచ మైదానంలో భారత జెండాను ప్రదర్శించక తప్పలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో కరాచీ మైదానంలో భారత జాతీయ పతాకం దర్శనమిస్తోంది. బంగ్లాదేశ్ జెండా కూడా కనిపిస్తోంది. దీంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. అయితే పాకిస్తాన్ దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. భద్రత కారణాలవల్ల తాము ఆ దేశంలో ఆడబోమని టీమిండియా ఇటీవలే తేల్చి చెప్పింది. దీంతో ఐసీసీ ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ కు మార్చింది. దుబాయ్ వేదికగా భారత్ ఆడే మ్యాచ్లను నిర్వహించడానికి ఒప్పుకుంది. భారత్ ఈ సిరీస్లో లీగ్ నుంచి సెమీస్, ఫైనల్ గనుక వెళితే.. దుబాయ్ వేదికగానే ఆ మ్యాచ్లో జరుగుతాయి. ఇక భారత్ పాకిస్తాన్ (IND vs PAK) మధ్య ఈనెల 23న దుబాయ్ వేదికగా లీగ్ మ్యాచ్ జరుగుతుంది.
India’s flag raised at the National Stadium in Karachi. What a moment ♥️♥️
We have big hearts, we don’t do cheap acts. All 7 Indian journalists granted Pakistan visas too #ChampionsTrophy2025 pic.twitter.com/zWfIMCaVex
— Farid Khan (@_FaridKhan) February 18, 2025