
KL Rahul Flying Catch: భారత క్రికెట్ అభిమానులకు ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా తట్టుకోలేరు. అభిమాన ఆటగాడు ఆడితే ఆకాశానికి ఎత్తేస్తారు. ఆడకుంటే నేలకపడేస్తారు.సరిగ్గా అలాంటిదే శుక్రవారం జరిగింది. ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సీరిస్‌లో భాగంగా వాంఖడే మైదానంలో తొలి వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఐదు పరుగులకే హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. సిరాజ్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు.
అతడు ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మొదట్లో స్మిత్ ఆచితూచి ఆడాడు. మరో ఓపెనర్‌తో షాన్ మార్ష్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. అప్పటికే షాన్ మార్ష్ మాంచి జోరు మీద ఉన్నాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్సర్లు బాదుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించడం ఖాయమని అందరూ అనుకున్నారు. బౌలర్లను మార్చినా ప్రయోజనం లేకపోవడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రంగంలోకి దిగాడు.

అప్పటికి ఆసీస్ స్కోరు వికెట్ నష్టానికి 77 పరుగులు. 12.3 ఓవర్‌లో హార్దిక్ వేసిన బంతిని స్లిప్‌లో ఆడాలని స్మిత్ ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ చివరి అంచును తాకింది. దీంతో ఆ బంతిని రాహుల్ అమాంతం ఎరిగి ఒంటి చేత్తో అందుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం స్మిత్ వంతయింది. నిరాశగానే మైదానాన్ని వీడాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘రాహుల్ భయ్యా ఒక్కసారిగా స్పైడర్ మ్యాన్‌వి అయిపోయావు.’ ‘ఆ బంతిని నువ్వు అందుకున్న విధానం చూస్తే ధోని గుర్తుకు వచ్చాడు’. ‘ ఒంట్లో ఎముకలను ఒక్కసారిగా పక్కకు పెట్టి క్యాచ్ అందుకున్నావా అంటూ’ నెటిజన్లు కామెంట్లు చేశారు.
Going Fine for Kl Rahul..will he hit a century??😄 #INDvsAUS pic.twitter.com/XXNOVdZ6eu
— Arpan Roy (@SportsArpan) March 17, 2023