Pawan Kalyan Old Movies: ఈమధ్య కాలం లో 10 కొత్త సినిమాలు విడుదల అవుతుంటే అందులో కేవలం ఒకటి రెండు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలుస్తున్నాయి..ఒక్కోసారి విడుదలైన 10 సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి..నిర్మాతలకు బయ్యర్స్ కి భారీ లాస్..అలాంటి సమయం లో ‘పోకిరి’ మరియు ‘జల్సా’ సినిమాలను రీ మాస్టర్ చేసి స్పెషల్ షోస్ గా వేసుకున్నారు ఫ్యాన్స్..రెస్పాన్స్ అదిరిపోయింది..ఇదేదో బాగుందే..డబ్బులు బాగా వస్తున్నాయి.

మంచి సందర్భం చూసి క్రేజీ హీరోల పాత సినిమాలను రీ మాస్టర్ చేసి థియేటర్స్ లో విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కొంతమంది నిర్మాతలకు మరియు బయ్యర్స్ కి వచ్చింది..అలా చాలా సినిమాలు రీ రిలీజ్ చేసారు కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు..కానీ రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ సినిమాని రీ మాస్టర్ చేసి డిసెంబర్ 31 వ తేదీన విడుదల చేసారు..విడుదల రోజు నుండి నేటి వరకు ఈ సినిమా థియేటర్స్ ని షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.
ఇప్పటికీ కూడా ఈ సినిమా సిటీస్ లో మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న తరుణం లో బయ్యర్స్ కి పవన్ కళ్యాణ్ పాత సినిమాలను రీ మాస్టర్ చేసి దింపితే డబ్బులే డబ్బులు అని అర్థం అయిపోయింది..ఇక థర్డ్ పార్టీ కి చెందిన బయ్యర్స్ వరుసగా పవన్ కళ్యాణ్ క్లాసిక్ సినిమాలను రీ మాస్టర్ చేసి విడుదల చెయ్యడానికి సిద్ధం అయిపోయారు..జనవరి 26 వ తేదీన పవర్ స్టార్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచినా బద్రి సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు..అలాగే ఫిబ్రవరి 14 వ తేదీన వాలంటైన్స్ డే ని పురస్కరించుకొని ‘తొలిప్రేమ’ సినిమాని రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.

ఈ రెండు సినిమాల తర్వాత మార్చి నెలలో ‘తీన్ మార్’ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్..వీటితో పాటు మెగా బ్రదర్ నాగ బాబు ‘గుడుంబా శంకర్’ ని రీ మాస్టర్ చేసి విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు..పవర్ స్టార్ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది మరియు డిజాస్టర్ పంజా సినిమాలను కూడా రిలీజ్ చేయబోతున్నారట..ఇలా ఈ ఏడాది మొత్తం పవన్ కళ్యాణ్ పాత సినిమాలతో థియేటర్స్ కళకళలాడబోతున్నాయి అన్నమాట.