Karimnagar: అంతుచిక్కని వ్యాధి ఆ కుటుంబంలో ఆరుగురిని బలి తీసుకుంది. ఏమౌతుందో తెసుకునేలోపే ఒకరి తర్వాత ఒకరు నెల రోజు వ్యవధిలోనే ఈ మరణాలు సంభవించాయి. దీంతో ఆ కుటుంబం మరణం మిస్టరీగా మారింది. కరీంనగర్ జిల్లా గంగాధరకు చెందిన ఓ కుటుంబంలో అంతుచిక్కని వ్యాధి పెను విషాదం నింపింది. 40 రోజుల్లో శ్రీకాంత్, భార్య మమతతోపాటు కూతురు అమూల్య(6), అద్వైత్(20 నెలలు) ఒకరి తరువాత ఒకరు మరణించారు. వీరంతా వాంతులు చేసుకుంటూ చనిపోయినట్లు స్థానికులు వెల్లడించారు. అయితే వ్యాధి ఏంటనేది ఇప్పటికీ తెలియడం లేదు. ఈ మాయదారి రోగం వైద్యులకు కూడా అంతుబట్టడం లేదు. మరణించిన కుటుంబ సభ్యుల రక్తనమూనాలను హైదరాబాద్ లోని ల్యాబ్‌కు పంపించారు. గంగాధర పోలీసులు ఈ మిస్టరీ డెత్స్ పై విచారణ కొనసాగిస్తున్నారు. ముందుగా శ్రీకాంత్ భార్య, పిల్లలు వరసగా మరణించారు. ఆ తరువాత శ్రీకాంత్ కూడా ఇటీవల ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరణించే ముందు శ్రీకాంత్ వాంతులు చేసుకుంటూ ప్రాణాలు వదిలారు. అంతకుముందు భార్య, పిల్లలు కూడా ఇదే తరహాలో మరణించడం గ్రామంలో విషాదాన్ని నింపింది. అయితే ఏ వ్యాధితో మరణించారో తెలియక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

రక్త కక్కుకుని శ్రీకాంత్ మృతి..
శ్రీకాంత్ రక్తం కక్కుకొని చనిపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రక్త నమూనాలను వైద్యాధికారులు హైదరాబాద్ ల్యాబ్‌కు పంపారు. ఏ కారణంతో చనిపోతున్నారో తెలియడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడేమోనని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సైన్స్ అభివృద్ధి చెందినా..
వైద్యరంగం దినదినాభివృద్ధి చెందుతోంది. కరోనా వచ్చిన ఏడాదిలోపే వ్యాక్సిన్ కనుకొన్నారు శాస్త్రవేత్తలు కానీ ఒక కుటుంబంలో 40 రోజుల వ్యవధిలో నలుగురి మృతికి కారణలు తెలుసుకోలేకపపోయారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం కూడా ఇందుకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఏది ఏమైనా మరణాల మిస్టరీ ఛేదించాలని, మరో కుటుంబ బలికాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.