Mobile Phone Banned: మనదేశంలో విచిత్రమైన నిర్ణయాలు తీసుకోవడం మామూలే. కొన్ని గ్రామాల్లో మద్యనిషేధం చేసిన సంఘటనలున్నాయి. కానీ మైనర్లు మొబైల్ వాడొద్దని ఓ గ్రామం ఏకగ్రీవ తీర్మానం చేసి అందరిలో ఆశ్చర్యం కలిగించింది. గ్రామంలో పద్దెనిమిది ఏళ్లు లేని వారు మొబైల్ వాడకం చేయకూడదు. మహారాష్ట్రలోని ఓ గ్రామం తీసుకున్న నిర్ణయం సంచలనానికి కారణమైంది. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా బన్సీ గ్రామంలో ఈ మొబైల్ వాడకాన్ని నిషేధించడం కొత్తదనానికి తెరతీసింది. మైనర్లపై ప్రేమతోనే ఇలా చేశారని చెబుతున్నారు.

చిన్న పిల్లలకు మొబైల్ ఇస్తే వారు చెడిపోతారనే ఉద్దేశంతో ఆ గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఊళ్లో ఎవరు కూడా ఫోన్ వాడకూడదు. ఒకవేళ వాడితే తల్లిదండ్రులకు జరిమానా విధించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సర్పంచ్ ఏకగ్రీవ తీర్మానం చేసి హెచ్చరికలు జారీ చేశారు. పిల్లల చేతిలో ఫోన్ కనిపిస్తే అంతే సంగతి. మొబైల్ లో గేమ్స్, వెబ్ సైట్స్ లో బిజీగా ఉంటూ చదువుకు దూరం అవుతున్నారు. సరిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
గ్రామసభ నిర్ణయంతో అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. చిన్న పిల్లల బాగు కోసం ఇలాంటి తీరుగా తీర్మానం చేయడం గమనార్హం. మొబైల్ వాడకంతో ఎన్నో ఇబ్బందులు రావొచ్చు. మైనర్లు ఫోన్లు వాడితే చాలా ప్రమాదాలు వస్తాయని చెబుతున్నారు. యువత నుంచి చిన్న పిల్లల వరకు మొబైళ్లలోనే బిజీగా ఉంటున్నారు. దీంతో వారిని ఫోన్లకు దూరంగా ఉంచాలని డిసైడ్ అవుతున్నారు. నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఫైన్ విధించేందుకు రెడీ అయ్యారు.

మైనర్లకు ఎలాంటి అలవాట్లు చేస్తే వారు అటు వైపే వెళ్తుంటారు. అందుకే ఫోన్ల వైపు పోకుండా చూసేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెబుతున్నారు. పిల్లలు చెడు దారి పట్టకుండా జాగ్రత్తగా ఉండేలా చూడాలని నిర్దేశిస్తున్నారు. గ్రామసభ తీసుకున్న నిర్ణయం అందరికి ఆమోదయోగ్యంగానే ఉండటంతో పేరెంట్స్ సైతం గ్రామసభ తీర్మానానికి మద్దతు ఇస్తున్నారు. పిల్లలకు మొబైల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో పిల్లల భవితవ్యం బాగుంటుందని ఆశిస్తున్నారు.