Malikappuram: అల్లు అరవింద్.. ఓ ఫక్తు సినీ వ్యాపారి.. రూపాయి పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు లాభం రావాలి అనుకునే రకం.. డిస్ట్రిబ్యూట్ సిండికేట్ లో పెద్ద తలకాయ్.. ఆ నలుగురు పెద్ద నిర్మాతల్లో ఒకడు.. తన సినిమా కోసం ఏదైనా చేయగలడు.. ఏమైనా చేయగలడు.. తెలుగు మాత్రమే కాదు మిగతా చిత్ర పరిశ్రమలనూ అంచనా వేయగలడు.. పెట్టుబడులు కూడా పెట్టగలడు.. దర్జాగా వెనుకేయగలడు.. అంత ముందు చూపు ఉన్నది కాబట్టే వందల కోట్లు వెనుకేయగలిగాడు.. తాజాగా కాంతార తో భారీగా వెనకేశాడు.. విశ్వసనీయ వర్గాల ప్రకారం రెండు కోట్లు పెట్టి కొంటే కోట్లకు కోట్లు కొల్లగొట్టాడు. కానీ అంతటి ముందు చూపు ఉన్న అల్లు అరవింద్ బొక్క బోర్లా పడ్డాడు. కాంతార రిపీట్ అవుతుందని అనుకున్నాడు.. పరిస్థితి తారుమారు కావడంతో సైలెంట్ అయిపోయాడు.

ఆఫ్ కోర్స్ అన్ని సినిమాలు కాంతార కావలని ఏమీ లేదు.. కథ కథనాలు భిన్నంగా ఉండటం, రిషబ్ శెట్టి క్లైమాక్స్ అనితర సాధ్యంగా ఉండటం దానికి కలిసొచ్చింది.. ఈ నేపథ్యంలో అరవింద్ కన్ను మలయాళంలో హిట్ అయిన మల్కాపురం సినిమాపై పడింది.. ఇది పూర్తి డివోషనల్ సబ్జెక్టు.. మలయాళం లో హిట్ టాక్ తెచ్చుకుంది.. ఇంకేముంది కొనేశాడు.. తెలుగులో రిలీజ్ చేశాడు.. చాలా థియేటర్లు తన గుప్పిట్లో ఉన్నాయి కదా… కాంతార అవుతుంది అనుకున్నాడు.. అదే ఎదురు తన్నింది.. థియేటర్లలో జనం లేరు.. అసలు జనానికి ఈ సినిమా వచ్చినట్టు తెలిస్తే కదా.. దాని జానరేమిటో? సింపుల్ గా కథేమిటో చెబితే, జనంలోకి రీచ్ అయితే కొంతైనా ఆసక్తి పుట్టేది.. సైలెంట్ గా థియేటర్లోకి వచ్చింది.. పోనీ కాంతార లాగా దీనికి పాజిటివ్ టాక్ వచ్చి ఉద్ధరిస్తుంది అనుకుంటే అదీ జరగలేదు. మలయాళం లో సూపర్ హిట్ అయిన సినిమా తెలుగులో ఫ్లాప్. మామూలు ప్లాప్ కాదు 90 ఎంఎం రాడ్.

వాస్తవానికి ఈ సినిమా మలయాళం లో 100 కోట్లు సాధించిందని ప్రచారం చేసుకున్నారు కానీ వాస్తవ పరిస్థితి అలా లేదు. కొన్ని సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు ఊదరగొట్టాయి. ఈ కథనం రాసే సమయానికి ఈ సినిమా మొత్తం వరల్డ్ వైడ్ కలెక్షన్లు 45 కోట్లు. అందులో ఇండియా కలెక్షన్లు 30 కోట్లు.. థియేటర్ రన్ కూడా పూర్తయింది..కొచ్చి లోనే 13 షోలకు పడిపోయింది సంఖ్య.. నిజానికి ఈ సినిమా కుటుంబంతో వెళ్ళదగినది.. ఇలాంటి సినిమాలను టీవీలు, ఓటీటీలో చూసేందుకే జనం ఆసక్తి చేపిస్తున్నారు.. ప్రేక్షకులకు థియేటర్ల నిలువు దోపిడిని భరించే స్తోమత లేదు. కాంతార కథ వేరు… కానీ మాలికాపురం సాదాసీదా సినిమా.. ఏమి ఉండవు.. కాంతార లాగే కుమ్మేస్తామని అనుకున్న అరవింద్ ఈ వసూలు చూసి షాక్ తిని ఉంటాడు.. అసలే అయ్యప్ప స్వామి మీద తీసిన సినిమా, తెలుగువారికి జనతా గ్యారేజ్ సినిమాతో పరిచయమైన నటుడు ఉన్ని ముకుందన్.. ఇప్పుడు ట్రెండ్ డివోషనల్ కాబట్టి సినిమా రన్ కు డోకా లేదని అనుకున్నాడు. కానీ ఆ అంచనా తలకిందులైంది.. సినిమా అడ్డంగా ఫ్లాఫ్ అయింది.