Driving License : రోడ్డు మీద మనం బండి నడపాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుని బయటకు వెళితే, ట్రాఫిక్ పోలీసులు మనల్ని పట్టుకునే అవకాశం ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారిపై చలాన్లు, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. అలా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రమాదాలు చేస్తే అరెస్టులు కూడా చేస్తారు. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం తప్పనిసరి. మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
* డ్రైవింగ్ లైసెన్స్ కోసం ‘పరివాహన్ సేవ’ (https://parivahan.gov.in/parivahan/) అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి.
* అక్కడ, ‘ఆన్‌లైన్ సేవలు’ కింద ‘లైసెన్స్ సంబంధిత సేవలు'(License Related Services )పై క్లిక్ చేయండి.
* తర్వాత ‘డ్రైవర్లు / లెర్నర్స్ లైసెన్స్'(Drivers / Learners License) సెలక్ట్ చేసుకోవాలి.
* రాష్ట్రాల జాబితా నుండి మీ రాష్ట్రాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
* ‘డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోండి'(Apply for Driving License)పై క్లిక్ చేయండి.
* దరఖాస్తులో అవసరమైన మీ వ్యక్తిగత సమాచారా(personal information)న్ని నమోదు చేయండి.
* డ్రైవింగ్ లైసెన్స్ రుసుమును అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ చెల్లింపు( online payment ) ఎంపికల ద్వారా చెల్లించాలి.
* దరఖాస్తు సమర్పించిన తర్వాత, మీరు డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి.
* మీరు షెడ్యూల్ చేసిన తేదీన సంబంధిత RTO కార్యాలయానికి వెళ్లాలి. మీరు డ్రైవింగ్ లైసెన్స్(DrivingLicense) పరీక్ష రాయాలి.
* మీరు పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్(DrivingLicense) జనరేట్ అవుతుంది.
* ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ మెయిల్ ద్వారా మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడుతుంది.
* మీరు కావాలనుకుంటే, మీరు డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆన్‌లైన్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
* మీరు మీ రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్ నుండి ఫారమ్ 4ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* లేదా RTO కార్యాలయానికి వెళ్లి ఫారమ్ 4ని పొందండి.
* డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా నింపాలి.
* డ్రైవింగ్ లైసెన్స్ కోసం నిర్దేశించిన దరఖాస్తు రుసుము చెల్లించాలి.
* RTO ద్వారా డ్రైవింగ్ టెస్ట్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
* షెడ్యూల్ చేసిన తేదీన నియమించబడిన RTO వద్ద డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాలి.
* మీరు పరీక్షలో ఉత్తీర్ణులైతే, మీ డ్రైవింగ్ లైసెన్స్ జనరేట్ అవుతుంది.
* ఈ డ్రైవింగ్ లైసెన్స్ పోస్టల్ మెయిల్ ద్వారా మీ రిజిస్టర్డ్ చిరునామాకు పంపబడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అర్హతలు
* డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, మీకు చెల్లుబాటు అయ్యే లెర్నర్స్ పర్మిట్(learner’s permit) ఉండాలి. దీని అర్థం మీరు అవసరమైన శిక్షణ పొందారని మరియు ప్రాథమిక డ్రైవింగ్ పరిజ్ఞానం కలిగి ఉన్నారని తెలుస్తుంది.
* ప్రైవేట్ వాహన లైసెన్స్ కోసం మీ వయస్సు 18 సంవత్సరాలు, వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ కోసం 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
* దరఖాస్తుదారులు ట్రాఫిక్ నియమాలు, రహదారి చిహ్నాలు, ఇతర ముఖ్యమైన అంశాలతో పరిచయం కలిగి ఉండాలి.
* లెర్నర్ లైసెన్స్ పొందిన 30 రోజుల్లోపు శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీరు దరఖాస్తు చేసుకోవాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: If you are stopped by the traffic police for not having a driving license do this with your phone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com