Director Rajamouli: రాజమౌళి మిస్టర్ కూల్. ఆయన సక్సెస్ సీక్రెట్ కూడా అదే. ఆర్ ఆర్ ఆర్ మూవీ నిర్మాణ సమయంలో ఆయన ఎన్నడు చూడని సమస్యలు ఎదుర్కొన్నారు. అనుకున్న సమయం కంటే దాదాపు రెండేళ్లు సినిమా ఆలస్యమైంది. దీంతో నిర్మాతలు, బయ్యర్ల నుండి ఒకటే ఒత్తిడి. హీరోలకు గాయాలు, కరోనా ఆంక్షలు ఇలా పలు సమస్యలు చుట్టుముట్టాయి. ఇంకొకరైతే సినిమాను ఎలాగొలా త్వరగా ముగించి విడుదల చేద్దాం అనుకునేవారు. రాజమౌళి అలా చేయలేదు. ఒత్తిడిని అధిగమించి ఆలస్యమైనా పర్లేదు బెస్ట్ అవుట్ ఫుట్ తో రావాలని నిగ్రహంగా పని చేశారు. దాని ఫలితం ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటేందుకు దోహదపడ్డారు.

ఇంటర్వ్యూలలో రాజమౌళి ఆచితూచి మాట్లాడతారు. ఆయన సినిమాల క్రెడిట్ లో సింహభాగం ఆయనకే దక్కుతుంది. హీరో, హీరోయిన్ కి, ఇతర సాంకేతిక నిపుణులకు కొంతమేరకే వెళుతుంది. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా రాజమౌళి పేరే మొదట వినిపిస్తుంది. అలా అని రాజమౌళి తాను మొత్తం క్రెడిట్ తీసుకోవాలి అనుకోరు. పబ్లిక్ ఒపీనియన్ ఏమైనా కానీ… సక్సెస్ లో క్రెడిట్ అందరికీ ఇచ్చేలా మాట్లాడతారు. ఇది కేవలం నావలనే సాధ్యం అనే అహంభావం ప్రదర్శించరు.
చాలా డిప్లోమాటిక్ మాట్లాడే రాజమౌళి అప్పుడప్పుడు సంచలన కామెంట్స్ చేస్తారు. ఇటీవల ఆయన ఓ అంతర్జాతీయ వేదికపై మాట్లాడుతూ… ఆర్ ఆర్ ఆర్ బాలీవుడ్ మూవీ కాదు. ఇది తెలుగు సినిమా. సౌత్ ఇండియా సినిమా అన్నారు. ఇది హిందీ సినిమా వర్గాలను హర్ట్ చేసింది. గతంలో కూడా ఆయన హీరో హృతిక్ రోషన్ ని కించపరిచాడనే వాదన. దానికి రాజమౌళి వివరణ ఇచ్చారు. నా పదాల ఎంపిక వలన జరిగిన పొరపాటే కానీ హృతిక్ రోషన్ ని అవమానించాలనే ఉద్దేశం నాకు లేదన్నారు.

తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ సినిమా అందుకుంటున్న ప్రతిష్టాత్మక అవార్డ్స్ అదనంగా వచ్చిన బహుమతులే కానీ… వాటి కోసం నేను సినిమా చేయలేదు అన్నారు. నాకు డబ్బులే ముఖ్యం. కమర్షియల్ గా నా సినిమా ఆడాలని, డబ్బులు రావాలనే ఆలోచనతో సినిమాలు చేస్తాను, అన్నారు. ప్రేక్షకులకు నచ్చి సినిమాకు డబ్బులు రావాలి, అది రాజమౌళి ఫస్ట్ ప్రయారిటీ. ఇక తన కష్టం నచ్చి అవార్డులు దక్కితే సంతోషం. రాజమౌళి టార్గెట్ మాత్రం అవార్డులు, అత్యున్నత పురస్కారాలు కాదని కుండబద్దలు కొట్టారు. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంటే సంతోషమే, కానీ ఆ అవార్డు కోసం ఆయన సినిమా తీయలేదని ఆయన మాటల ద్వారా అర్థం అవుతుంది.