IAS Officer Tina Second Marriage: ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్. కానీ ఆమెకు సెలబ్రిటీల లాగే సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇందుకు కారణం 2015లో ఐఏఎస్ టాపర్ గా నిలవడమే. ఆమెనే టీనా దాబి. దేశ వ్యాప్తంగా టీనా మొదటి ర్యాంకు సాధించి సంచలనం సృష్టించింది. కాగా ఇప్పుడు ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. ఇందుకు కారణం ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో తోటీ ఐఏఎస్ ఆఫీసర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఇప్పుడు రెండో పెళ్లి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె తనకు కాబోయే భర్త ఫోటోలను షేర్ చేసింది. 2013 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ గవాండేను పెళ్లి చేసుకోబోతున్నారు. గతంలో 2015 బ్యాచ్ లో రెండో ర్యాంకు సాధించిన అధర్ అమీర్ ఖాన్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు టీనా. ట్రైనింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారి తీసి.. 2018 లో మతాంతర వివాహం చేసుకున్నారు.
Also Read: Arvind Kejriwal on The Kashmir Files: గొప్ప సినిమాను రాజకీయం చేస్తే ఎలా ?
అప్పట్లో వీరి పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా చాలా మంది కేంద్ర మంత్రులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. కానీ రెండేళ్లకే వీరి మధ్య వచ్చిన మనస్పర్థలతో గతేడాది విడిపోయారు. అప్పటి నుంచి వేరుగా ఉంటున్న టీనా రాజస్థాన్ కేడర్ లో పని చేస్తోంది. కాగా ముంబైకి చెందిన ప్రదీప్ రాజస్థాన్ పురావస్తు శాఖకు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.

ఒకే రాష్ట్రంలో పనిచేస్తున్న వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరగడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. టీనా కంటే ప్రదీప్ 13 ఏళ్ళు పెద్ద వాడు కావడం విశేషం. అయినా సరే ప్రదీప్ ను పెళ్లి చేసుకోవడానికి టీనా సిద్ధపడింది. ఇప్పటికే వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది. వివాహం కూడా త్వరలోనే ఉంది. ఒక దళిత అమ్మాయి అయిన టీనా ఐఏఎస్ మొదటి ర్యాంకు సాధించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read: Russia Ukraine War: భర్తను చంపి యుక్రెయిన్ మహిళపై అత్యాచారం.. ఇదీ రష్యన్ సైనికుల దురాగతం..