Hari Hara Veera Mallu- Hyper Aadi: హరి హర వీరమల్లు షూట్ పవన్ కళ్యాణ్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హరి హర వీరమల్లు కంప్లీట్ చేసి పూర్తిగా రాజకీయ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. పవన్ పై హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు రూపొందిస్తున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. మరో భారీ షెడ్యూల్ కి మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది హరి హర వీరమల్లు చిత్రానికి రచయితగా పని చేస్తున్నాడట. అయితే ఆయన పూర్తి స్థాయిలో కాదు. కేవలం కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది డైలాగ్స్ రాస్తున్నారట. టైమింగ్ కామెడీ పంచ్లకు హైపర్ ఆది పెట్టింది పేరు. మనోడి స్కిట్స్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. హైపర్ ఆది స్కిట్స్ లో నాన్ స్టాప్ కామెడీ పంచెస్ నవ్వులు పూయిస్తాయి. ఈ క్రమంలో హరి హర వీరమల్లు కామెడీ సన్నివేశాలకు అతడి సాయం తీసుకుంటే బెటర్ ని మేకర్స్ భావించారట. దర్శకుడు క్రిష్… హరి హర వీరమల్లు కామెడీ ఎపిసోడ్స్ కి హైపర్ ఆది చేత డైలాగ్స్ రాయించారని విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఇక హరి హర వీరమల్లు చిత్రానికి పూర్తి స్థాయి రచయితగా సాయిమాధవ్ బుర్రా పని చేస్తున్నారు. ఈ మధ్య భారీ ప్రాజెక్ట్స్ కి ఆయనే రచయితగా పని చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి సైతం మాటలు అందించింది ఆయనే. ఇక కొన్నాళ్లుగా క్రిష్ చిత్రాలకు సాయి మాధవ్ బుర్రానే రచయితగా వ్యవహరిస్తున్నారు. కేవలం కామెడీ సన్నివేశాల కోసం హైపర్ ఆదిని ఇన్వాల్వ్ చేశారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హైపర్ ఆది కామెడీ రోల్ చేస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. నిర్మాత ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మొఘలుల కాలం నాటి బందిపోటు వీరుడి కథగా హరి హర వీరమల్లు రూపొందుతుంది. మొగలులను ముప్పతిప్పలు పెట్టే వీరుడి పాత్రలో పవన్ పోరాటాలు, విన్యాసాలు అబ్భురపరచనున్నాయి.