
Hyper Aadi: జబర్దస్త్ ప్రొగ్రామ్ ద్వారా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది గురించి తెలియని వారుండరు. ఈమధ్య సినిమాల్లోనూ సందడి చేస్తున్న ఈయన అప్పుడప్పుడు టీవీ షో ల్లో కనిపిస్తూ అల్లరి చేస్తున్నాడు. హైపర్ ఆది వేసే పంచ్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ‘ఢీ’ 15వ సీజన్లో హైపర్ ఆది చేసిన హంగామా హైలెట్ గా నిలిచింది. హైపర్ ఆది, నటి శ్రద్ధాదాస్ మధ్య జరిగిన ఓ సీన్ షాక్ తెప్పిస్తోంది. కామెడీని పండించే క్రమంలో ఆయన శ్రద్దాదాస్ బ్యాక్ పై కొడుతాడు. ఆ తరువాత పండు కూడా తెగ అల్లరి చేశాడు. దివ్యకు దెబ్బతగిలిని చోటే ముద్దుపెట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఒకప్పుడు సీరియళ్ల కోసం ఆడవాళ్లు మాత్రమే టీవీలు చూసేవాళ్లు. కానీ ఇప్పుడు యూత్ మొత్తం స్మాల్ స్క్రీన్ ను కనెక్ట్ అవుతోంది. సినిమాల కంటే ఎక్కువగా టీవీ ప్రొగ్రామ్స్ వినోదం అందించడంతో చాలా మంది వీటిని ఫాలో అవుతున్నారు. యువతను ఆకర్షించడానికి ఛానెల్స్ పోటీపడి షోలు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో జబర్దస్త్, ఢీ ప్రొగ్రామ్స్ హైలెట్ గా నిలుస్తున్నాయి. మెరికలు తిరిగే డ్యాన్స్ చేసేవారి ప్రతిభను బయటపెట్టేందుకు నిర్వహించే ఢీ ప్రొగ్రామ్స్ కు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. దీంతో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఢీ 15వ సీజన్ కొనసాగుతోంది. ‘చాంపియన్స్ బ్యాటిల్’ పేరుతో వస్తున్న ఈ సీజన్ లో ఏ అండ్ బీ అనే రెండు టీంల మధ్య పోటీ తీవ్రంగా సాగుతోంది. ఢీ 15వ సీజన్ కు హైపర్ ఆది, జస్వంత్ పడాల మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ జడ్జిలుగా ఉన్నారు. ఇక ఢీ 15వ సీజన్ లోకి మాస్టర్ వైల్డ్ కార్డు ద్వారా పండు ఎంట్రీ ఇచ్చాడు. అతడు వచ్చి రాగానే కామెడీని పండించాడు. దీంతో అతడిని జడ్జి శేఖర్ మాస్టర్, శ్రద్ధాదాస్ లు పండును ఓ చోట కొట్టారు.

పండును అందరూ స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఆదిని శ్రద్ధాదాస్ పలు మార్లు తన బ్యాక్ పై కొట్టేస్తుంది. ఈ సమయంలో ప్రదీప్ మాట్లాడుతూ ఆదిని ఈవిడ కొడుతుంది అని అంటాడు. దీంతో వెంటనే హైపర్ ఆది రియక్షనయి శ్రద్ధాదాస్ బ్యాక్ పై కొట్టేస్తాడు. దీంతో అక్కుడన్నవారంతా షాక్ అయ్యారు. అయితే మిగతావారందరూ ఆదిని తరుముతారు.
ఆది పరుగులు పెట్టి దివ్వ, జెస్పీ మధ్యలో కూర్చుంటాడు. ఆదిని తరిమిన పండు మాస్టర్ ఆదిని కొట్టే క్రమంలో దివ్య తలకు తాకుతుంది. దీంతో మరోసారి అంతా ఫీలవుతారు. అయితే పండు వెంటనే కలుగజేసుకొని దివ్యకు దెబ్బ తగిలిన చోట ముద్దు పెడుతారు. అంతే ఒక్కసారిగా అల్లరి స్ట్రాట్ అవుతుంది. పండు అక్కడి నుంచి పరారవుతాడు. ఈ షో కు సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.