https://oktelugu.com/

Hyderabad Police: హెల్మెట్, పుచ్చకాయ.. హైదరాబాద్ పోలీస్ వీడియో వైరల్

Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎంత అనర్థాలు జరుగుతాయో వివరించేందుకు వారు షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక చిన్న కుర్రాడు బైక్ పై వెళ్లడానికి హెల్మెట్ ధరించకపోతే తండ్రి వారిస్తాడు.. హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తాడు. కానీ దాన్ని ఆ చిన్న పిల్లాడు వినడు. దీంతో అతడికి హెల్మెట్ ప్రాధాన్యతను వివరించడానికి ఒక పుచ్చకాయను హెల్మెట్ లో పెట్టి కింద […]

Written By:
  • NARESH
  • , Updated On : March 17, 2022 / 10:23 PM IST
    Follow us on

    Hyderabad Police: హైదరాబాద్ పోలీసులు షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ఎంత అనర్థాలు జరుగుతాయో వివరించేందుకు వారు షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

    ఒక చిన్న కుర్రాడు బైక్ పై వెళ్లడానికి హెల్మెట్ ధరించకపోతే తండ్రి వారిస్తాడు.. హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తాడు. కానీ దాన్ని ఆ చిన్న పిల్లాడు వినడు. దీంతో అతడికి హెల్మెట్ ప్రాధాన్యతను వివరించడానికి ఒక పుచ్చకాయను హెల్మెట్ లో పెట్టి కింద పడేస్తాడు. అది పగలదు. అనంరతం ఒట్టి పుచ్చకాయను మరోసారి బైక్ పై నుంచి పడేస్తాడు. అప్పుడు పుచ్చకాయ పగిలిపోతుంది.

    దీన్ని చూపించి హెల్మెట్ పట్టుకోకపోతే నీ తల పగులుతుందని ఉదాహరణతో ఆ తండ్రి చూపిస్తాడు. దీనికి భయపడ్డ ఆ కుర్రాడు వెంటనే హెల్మెట్ పెట్టుకుంటాడు. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు షేర్ చేశారు.

    ఈ సందర్భంగా ఒక మంచి కొటేషన్ ను పోలీసులు దానికింద రాసుకొచ్చారు. ‘‘అమ్మ ప్రాణం పోసి రూపం ఇస్తే ఆ రూపానికి మంచి వ్యక్తిత్వం నేర్పే శక్తే నాన్న.  నిజ ప్రతిబింబం పిల్లల కళ్ళకు కట్టేలా నేర్పడం ఒక కళ, ప్రతీ తండ్రి ఆ కలల హీరో అవ్వాలనేదే మా ఆశ.
    మొక్క అయి వంగనిది మానై వంగునా. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి, మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి’’ ఒక మంచి వీడియోతో పోలీసులు షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.