Hyderabad
Hyderabad: హైదరాబాద్ ల్యాంకో హిల్స్ లో వరుసగా మహిళల ఆత్మహత్యలు మిస్టరీగా మారుతున్నాయి. ఈమధ్య ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. తాజాగా బిందు శ్రీ (28) అనే యువతి బలవన్మరణానికి పాల్పడింది. 21వ అంతస్తు నుండి దూకి అఘాయిత్యం చేసుకుంది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. విస్తు పోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. లాంకో హిల్స్ లో నివాసముంటున్న ఓ కన్నడ నటుడు వేధింపులు వల్లే యువతి ఆత్మహత్య చేసుకున్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఇటీవల జరిగిన ఆత్మహత్య ఘటనలకు ఆయనే కారణమన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పూర్ణచందర్రావు కొన్ని కన్నడ సినిమాల్లో నటించాడు. కానీ అక్కడ అవకాశాలు దొరకపోవడంతో హైదరాబాద్ మకాం మార్చాడు. మణికొండ లోని లాంకో హిల్స్ లో ఎల్ హెచ్ 15 బ్లాక్ లో భార్య, కుమార్తెతో నివాసం ఉంటున్నాడు. కాగా తన కుమార్తెను చూసుకునేందుకు కాకినాడకు చెందిన బిందు శ్రీ అనే యువతని కేర్ టేకర్ గా పెట్టుకున్నాడు. పదేళ్లుగా ఆ యువతి యే కొనసాగుతోంది. ఆమెకు అదే ప్లాట్ లోని ఒక గదిని కేటాయించారు. అందులోనే ఆమె నివాసముంటుంది. ఈ క్రమంలో బిందు శ్రీ తో పూర్ణచందర్రావు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పదేళ్లుగా తమ బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే వారిద్దరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో తన కుమార్తెను చూసుకునేందుకు ఇంకో యువతిని పూర్ణచంద్రరావు ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో శుక్రవారం రాత్రి బిందు శ్రీ కి పూర్ణచంద్రరావుకి మధ్య గొడవ జరిగింది. అర్ధరాత్రి వరకు వివాదం కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బిందు శ్రీ 21వ అంతస్తు పై నుంచి కిందకు దూకింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. బిందు శ్రీ చనిపోయిందని పూర్ణచంద్రరావుకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. దీంతో ఆయనపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే దీనిపై పోలీసులు లోతైన విచారణ ప్రారంభించారు. పూర్ణచంద్రరావు తనకు తానుగా కన్నడ సినిమాల్లో గొప్ప నటుడిగా అందరికీ పరిచయం చేసుకునేవాడు. సినిమా రంగంలో విస్తృత పరిచయాలు ఉన్నాయని నమ్మబలికేవాడు. సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ చాలామంది యువతులను ప్రలోభాలకు గురి చేసేవాడు. తరచూ చాలామంది యువతులు ఆయన ఫ్లాట్ కు వచ్చి వెళ్తుండేవారు. ప్లాట్ లో నివసిస్తున్న మిగతా వారు కూడా ఇదే విషయాన్ని పోలీసులకు వివరించారు. ఇటీవల మహిళల ఆత్మహత్యలకు ఆయనే కారణమని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పూర్ణచందర్రావు వేధింపుల వల్లే బిందు శ్రీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Hyderabad kannada actor arrested for causing suicide of 28 year old girl
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com