Husband And WIfe Relationship: రోజు అది ఉంటేనే ఇంటికి వస్తా.. ఆ పని చేస్తా.. భార్య వింత డిమాండ్

నేహ నిజంగానే మద్యం, మాంసం కావాలని కోరుతుందా? లేక పెళ్లి ఇష్టం లేక ఇలా డిమాండ్ చేస్తుందా? అన్నచర్చ సాగుతోంది.

Written By: Chai Muchhata, Updated On : March 23, 2024 11:58 am

Wife Demand Husband Wine Non Veg

Follow us on

Husband And WIfe Relationship:  వివాహంతో రెండు మనసులు ఒక్కటవుతాయి. ఇద్దరు వేర్వేరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండానికి పెళ్లి వేదికగా మారుతుంది. ఈ పెళ్లినికొందరు సాంప్రదాయంగా నిర్వహించుకుంటే, మరికొందరు మాత్రం ఆడంబరాలు లేకుండా సింపుల్ గా జరుపుకుంటారు. అయితే పెళ్లి ఎలా జరిగినా భార్యభర్తలు జీవితాంతం తోడుంటేనే వారి వివాహ బంధానికి అర్థం ఉంటుంది. కానీ నేటి కాలంలో దంపతుల మధ్య చిన్న విషయాలకే మనస్పర్థలు వస్తున్నాయి. కలకాలం కలిసుండాల్సిన వారు కొన్ని విషయాలతో దూరం అవుతున్నారు. అయితే కొందరికి ఉన్న విచిత్ర అలవాట్లతో దంపతుల మధ్య మనస్పర్థలు రావడం మరోకారణంగా చెప్పవచ్చు. తాజాగా భర్తలను ఓ భార్య వింత కోరిక కోరింది. అంది ఉంటేనే కాపురం చేస్తానంటూ పట్టుబట్టింది. ఇంతకీ ఆమె ఎలాంటి కోరిక కోరిందంటే?

ఇండోర్ కు చెందిన నేహా జైన్ తో చిరాగ్ అనే వ్యక్తికి గత ఏడాది పెళ్లయింది. వీరిద్దరు కొన్ని రోజుల పాటు సంతోషంగా ఉన్నారు. కానీ ఆ తరువాత పుట్టింటికి వెళ్లిన నేహ అత్తారింటికి రావడంలేదు. సాధారణంగా పెళ్లయినకొత్తలో ఏ ఆడపిల్ల అయినా అత్తారింటికి వెళ్లాలంటే బయపడుతుంది. తల్లిదండ్రులు అలా ఆలోచించి కొన్ని రోజుల పాటు వదిలేశారు. ఆ తరువాత అడిగినా నేహ అత్తారింటికి వెళ్లనని తెగేసి చెప్పింది. అయితే తాను అత్తారింటికి వెళ్లాలంటే మాత్రం కొన్ని ఉండాలని నిబంధనలు పెట్టింది.

సాధారణంగా మద్యం తాగే మగాళ్లంటే ఆడాళ్లకు చిరాకు. మద్యంసేవించే భర్తలు ఉంటే కొందరు అసహించుకుంటారు. కానీ నేటి కాలంలో ఆడవాళ్ల కోసం కొందరు మద్యంమానేస్తున్నారు. కానీ నేహ జైన్ మాత్రం తనకు మద్యం, మాంసం ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రతిరోజూ మద్యం, మాంసం ఉంటేనే అత్తారింటికి వెళ్తానని తల్లిదండ్రులకు చెప్పిందట. ఈ విషయం భర్తకు కూడా చెప్పి డిమాండ్ చేస్తోందట. దీంతో విసుగెత్తిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే నేహ నిజంగానే మద్యం, మాంసం కావాలని కోరుతుందా? లేక పెళ్లి ఇష్టం లేక ఇలా డిమాండ్ చేస్తుందా? అన్నచర్చ సాగుతోంది. సాధారణంగా మద్యంకు వ్యతిరేకంగా ఉండే చాలామంది ఇలాంటి డిమాండ్లు ఎవరూ కోరరని అంటున్నారు. ఒకవేళ అలాంటి అలవాటు ఉన్నా.. మానుకుంటారని, ఇలా డిమాండ్ చేస్తూ పుట్టింట్లోనే ఉండడంపై పెళ్లి ఇష్టం లేదు కావొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.