
Romance : ఇటీవల సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. ఏ చిన్న విషయమైనా బహిర్గతం చేస్తూ అందరి నోళ్లలో నాన్చుతున్నారు. స్మార్ట్ ఫోన్లు రావడంతో గుట్టుగా ఉండాల్సిన వాటిని అందరికి తెలిసేలా చేస్తున్నారు. ఏం జరిగినా క్షణాల్లో వీడియో తీస్తూ నెట్ లో పెడుతున్నారు. దీంతో ప్రైవసీ లేకుండా పోతోంది. అది భార్యాభర్తల మధ్య గొడవైనా అన్నదమ్ముల మధ్య తగాదాలైనా ఇట్లే నెట్లో కనిపిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు లైకులు, కామెంట్లు కొడతారనే ఉద్దేశంతో ప్రైవసీని పణంగా పెడుతున్నారు. గతంలో సాధారణ విషయాలు మనకు తెలిసేవి కావు. వాటిలో ఎంతో వైవిధ్యముంటే తప్ప మన దృష్టికి వచ్చేది కాదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావంతో తుమ్మినా దగ్గినా దాన్ని వైరల్ చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితాన్ని కూడా సమాజ పరం చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా జరిగిన ఓ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. భార్యాభర్తలు పొలం పనుల కోసం చేనుకు వెళ్లారు. అక్కడ పనిచేసే క్రమంలో ఆలుమగల మధ్య ఆగ్రహం వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు తోపులాడుకున్నారు. ఇందులో భార్యదే పైచేయి అయింది. ఈ సందర్భంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దీన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో దానికి విపరీతమైన లైకులు, షేర్లు వచ్చాయి.
భార్య కొట్టిన దెబ్బలకు భర్త తట్టుకోలేకపోయాడు. పెనుగులాటలో ఆమెదే పైచేయి అయింది. దీంతో చచ్చాన్రో దేవుడో అని అతడు పరుగు పెట్టాడు. ఇదంతా ఆపాల్సిన అతడు చోద్యం చూస్తూ వీడియో తీయడం వివాదాస్పదమయింది. దీనిపై అతడికి కూడా అక్షింతలు పడుతున్నాయి. వారు గొడవ పడుతుంటే చూస్తూ వీడియో తీసిన అతడి తీరును విమర్శిస్తున్నారు. అసలు వాడికి బుద్ధి ఉందా అని తిడుతున్నారు. ఏదైనా వైరల్ చేయాలని చూస్తున్నారు కానీ దాన్ని ఆపాలని ప్రయత్నించడం లేదు.
ఇంతకీ ఆ భార్యాభర్తల్లో ఎవరు తప్పు చేశారో తెలియడం లేదు. వారి గొడవకు కారణాలేంటో కూడా అర్థం కాదు. ఇలాంటి సందర్భంలో అతడు వారి గొడవను శాంతింపచేయాల్సింది పోయి దాన్ని వీడియో తీసి పోస్టు చేయడం వెనుక అతడి ఆంతర్యమేమిటి? వారిలో గొడవ రాజుకోవడానికి కారణమేంటో తెలుసుకుని పరిష్కరించడం అతడి విధి. కానీ అతడు వారి గొడవను బహిర్గతం చేయాలనే ఉద్దేశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మనిషిలో మంచితనం కానరావడం లేదు. తన స్వార్థం కోసం పనిచేస్తున్నాడు కానీ ఎదుటి వారి బాధలను అర్థం చేసుకోకపోవడం గమనార్హం.
View this post on Instagram