https://oktelugu.com/

Sudheer Babu Hunt Trailer: సుధీర్ బాబు వేట ఎవరి కోసం… ఉత్కంఠ రేపుతున్న హంట్ ట్రైలర్!

Sudheer Babu Hunt Trailer: హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హంట్. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. జనవరి 26న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ హంట్ ట్రైలర్ స్వయంగా విడుదల చేశారు. ప్రభాస్ విడుదల చేయడంతో సుధీర్ బాబు చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. ఇక ట్రైలర్ లో సినిమా కథ ఏంటనేది స్పష్టత ఇచ్చారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : January 18, 2023 / 12:12 PM IST
    Follow us on

    Sudheer Babu Hunt Trailer: హీరో సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ హంట్. యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. జనవరి 26న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ హంట్ ట్రైలర్ స్వయంగా విడుదల చేశారు. ప్రభాస్ విడుదల చేయడంతో సుధీర్ బాబు చిత్రానికి మంచి ప్రచారం దక్కింది. ఇక ట్రైలర్ లో సినిమా కథ ఏంటనేది స్పష్టత ఇచ్చారు. మర్డర్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా హంట్ తెరకెక్కింది. పోలీస్ అధికారి అయిన సుధీర్ బాబు హంతకుడు ఎవరో పట్టుకోవాలని తాపత్రయ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లు ఏమిటి? కేసు ఎలా ఛేదించాడనేది? హంట్ మూవీ కథ.

    Sudheer Babu Hunt Trailer

    ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. లేటెస్ట్ రిలీజ్ ‘హిట్-2’ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. థ్రిల్లర్స్ కి కథనమే ప్రధాన బలం. ఉత్కంఠ రేపుతూ సినిమా నడిపించగలిగితే విజయం తథ్యం. హంట్ మూవీలో సస్పెన్సు ఎలిమెంట్స్ తో పాటు దుమ్మురేపే యాక్షన్ ఉంది. సుధీర్ బాబు సీరియస్ కాప్ రోల్ లో రౌడీలను ఇరగదీస్తున్నాడు. సీనియర్ హీరో శ్రీకాంత్, కోలీవుడ్ నటుడు భరత్ కీలక రోల్స్ చేశారు.

    ఇక దర్శకుడు మహేష్ సూరపనేని కమర్షియల్ అంశాల జోలికి పోయినట్లు లేదు. హీరోయిన్, సాంగ్స్, కామెడీకి కథలో ఆయన స్పేస్ ఇవ్వలేదు. ఆరంభం నుండి చివరి వరకు యాక్షన్, ఇన్వెస్టిగేషన్, సస్పెన్సు అంశాలతో సాగనుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ సంగీతం అందించారు. ట్రైలర్ ఆకట్టుకోగా హంట్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.

    Sudheer Babu Hunt Trailer

    కాగా ఒక్క హిట్ అంటూ ఏళ్లుగా సుధీర్ బాబు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేయని ప్రయోగం లేదు. ఏ జోనర్ ట్రై చేసినా ప్రేక్షకులు ఆదరించడం లేదు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం మాత్రమే ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఆయనకు కమర్షియల్ హిట్ పడలేదు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలు కూడా కమర్షియల్ గా ఆడటం లేదు. ఆయన లేటెస్ట్ రిలీజ్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

    Tags