Ram Gopal Varma: 2019లో “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” అనే పేరుతో రాంగోపాల్ వర్మ ఓ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సున్నితమైన అంశాలు ఉన్నాయని.. అవి కమ్మ సామాజిక వర్గం వారిని దెబ్బతీస్తున్నాయని కొంతమంది రాంగోపాల్ వర్మపై కోర్టుకు వెళ్లారు. కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే నాడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో రాంగోపాల్ వర్మపై ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతోపాటు రాంగోపాల్ వర్మ “ఎన్టీఆర్స్ లక్ష్మి” అనే చిత్రాన్ని కూడా తీశారు. నాడు ఈ చిత్రాన్ని ప్రదర్శించకుండా టిడిపి ప్రభుత్వం అనేక ఒత్తిళ్లు తీసుకొచ్చింది. చివరికి రాంగోపాల్ వర్మ కోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవడంతో సినిమా విడుదలైంది. ఈ సినిమా లో కొన్ని సంచలన విషయాలు ఉండడంతో నాడు చర్చకు దారి తీసింది. ఇదే సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ లు తీసినప్పటికీ అవి విజయవంతం కాలేదు. వైయస్ఆర్ జీవిత చరిత్రపై మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన యాత్ర సినిమా అప్పట్లో విజయవంతమైంది. మొత్తంగా లక్ష్మీస్ ఎన్టీఆర్, యాత్ర వంటి సినిమాలు వైసిపికి మౌత్ పీస్ లుగా నాటి ఎన్నికల్లో ఉపయోగపడ్డాయి..
Also Read: పవన్ ను తిడితే ఎలా.. నష్టమని తెలిసినా ఎందుకలా జగన్!
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో….
2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధికారంలోకి రావడంతో.. రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను రూపొందించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి.. ఇన్ని సంవత్సరాలపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కమ్మవారి ప్రాతినిధ్యం తగ్గిపోతుందని.. ఇకపై రెడ్లదే ఆధిపత్యం నడుస్తుందని రాంగోపాల్ వర్మ ఆ సినిమాలో చూపించారు. జగన్, చంద్రబాబు పాత్రలకు తగ్గట్టుగా కథానాయకులను ఎంపిక చేసుకొని సినిమాను రక్తి కట్టించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ చేశారు. అయితే టైటిల్ కి తగ్గట్టుగా ఈ సినిమాలో సరుకు లేకపోవడంతో అంతగా ఆడలేదు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కొంతమంది కోర్టుకు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. ఇకనాడు వైసిపి అధికారంలో ఉండడంతో రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2019లో విడుదలైన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాపై దాఖలైన కేసులను తిరగ తోడటం మొదలైంది. దీంతో ఏపీ సిఐడి అధికారులు రాంగోపాల్ వర్మపై అభియోగాలు మోపారు. నోటీసులు కూడా ఇచ్చారు. అయితే దీనిపై రాంగోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి దాఖలు చేసిన అభియోగాలపై ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సిఐడి అధికారుల కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆయన అందులో కోరారు. దీనిపై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఏపీ సిఐడి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. 2019లో కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా విడుదలయితే.. 2024 లో కేసు ఎలా నమోదు చేస్తారని మండిపడింది. మరోవైపు రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. దానిని కొట్టేయాలని రాంగోపాల్ వర్మ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఏపీ సిఐడి అధికారులు తదుపరి అడుగులు ఎలా వేస్తారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు నాడు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిడిపి పై, జనసేనపై రాంగోపాల్ వర్మ విరుచుకుపడేవారు. ట్విట్టర్లో విమర్శలు చేసేవారు. అందువల్లే ఇప్పుడు కేసు నమోదు అయిందని తెలుస్తోంది. హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పువచ్చిన నేపథ్యంలో రాంగోపాల్ వర్మపై కూటమి ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎటువంటి అడుగులు వేస్తారు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Also Read: పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్ నరేందర్ రెడ్డి ఎందుకు ఓడాడు?