Puri Jagannath Charmi : భారీ మోసం.. ఈడీ కార్యాలయంలో పూరి జగన్నాథ్ – ఛార్మీ.. అరెస్ట్ తప్పదా

Puri Jagannath Charmi : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’.. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మించారు. ఆయనతో పాటుగా హీరోయిన్ ఛార్మి కి కూడా నిర్మాణం లో భాగస్వామ్యగా ఉన్నారు. 40 కోట్ల రూపాయిలలోపే సినిమాని చుట్టేసి డిస్ట్రిబ్యూటర్స్ కి 90 కోట్ల రుపాయిలకు పైగానే అమ్ముకున్నారు..సినిమా దారుణమైన పరాజయం పాలవ్వడం తో బయ్యర్స్ కి 60 […]

Written By: NARESH, Updated On : November 17, 2022 8:58 pm
Follow us on

Puri Jagannath Charmi : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన పాన్ ఇండియా మూవీ ‘లైగర్’.. పూరి జగన్నాథ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించి నిర్మించారు. ఆయనతో పాటుగా హీరోయిన్ ఛార్మి కి కూడా నిర్మాణం లో భాగస్వామ్యగా ఉన్నారు. 40 కోట్ల రూపాయిలలోపే సినిమాని చుట్టేసి డిస్ట్రిబ్యూటర్స్ కి 90 కోట్ల రుపాయిలకు పైగానే అమ్ముకున్నారు..సినిమా దారుణమైన పరాజయం పాలవ్వడం తో బయ్యర్స్ కి 60 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలు వాటిల్లాయి.

ఇప్పుడు ఆ బయ్యర్స్ అందరూ పూరి జగన్నాథ్ ఆఫీస్ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారు..పూరి జగన్నాథ్ వాళ్ళని తప్పించుకొని తిరుగుతున్నాడు..నిజానికి ఈ సినిమా ద్వారా పూరి జగన్నాథ్ కి వచ్చిన నష్టం ఏమి లేదు..సాటిలైట్ రైట్స్ మరియు డిజిటల్ రైట్స్ కూడా భారీ మొత్తంలోనే అతనికి ముట్టింది..అయితే ఇప్పుడు పూరి జగన్నాథ్ మరియు ఛార్మి పై ఈడీ అధికారులు దాడులు చేసారు.

లైగర్ మూవీ లావాదేవీలకు సంబంధించి పూరి జగన్నాథ్ మరియు ఛార్మీలనుఈ ఈడీ అధికారులు విచారిస్తున్నారు..ప్రముఖ విదేశీ సంస్థల నుండి పూరి జగన్నాథ్ మరియు ఛార్మి అకౌంట్లోకి వచ్చిన భారీ మొత్తం నిధులపై ఈరోజు ఉదయం నుండి విచారణ జరుపుతున్నట్టు తెలుస్తుంది..15 రోజుల క్రితమే ఈ పార్టనర్స్ ఇద్దరికీ ఈడీ అధికారులు నోటీసులు పంపారట..దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి..భారీ నష్టాలు వచ్చాయి అని చెప్పుకుంటున్న పూరి జగన్నాథ్ కి ఈ సినిమా పేరు మీద ఇన్ని డబ్బులు ఎక్కడివి..వీటికి లెక్కలు చెప్పాలంటూ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారట.

లెక్కలన్నీ తారుమారుగా ఉండడం వల్లే ఈ విచారణ జరుపుతున్నట్టు సమాచారం..మరోపక్క డిస్ట్రిబ్యూటర్స్ పై పూరి జగన్నాథ్ కొద్దీ రోజుల క్రితం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన సంగతి మనకి తెలిసిందే..అంతే కాకుండా వీళ్లిద్దరు ఇప్పుడు విజయ్ దేవరకొండ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదట..అతని ఫోన్ కాల్స్ సైతం లిఫ్ట్ చేయట్లేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్న మాట.