Snake Wine :స్నేక్ వైన్.. దీనికోసం ఎగబడతారు.. ఎలా తయారు చేస్తారు అంటే?

తాగినవారు తమ హెయిర్‌ఫాల్‌ కంట్రోల్‌ అయిందని, ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిందని, బోన్స్‌ బలంగా తయారవుతన్నాయని చెబుతున్నారు.

Written By: NARESH, Updated On : February 12, 2024 6:54 pm
Follow us on

Snake Wine : వైన్‌.. ఇదో రకమైన పానీయం. దీనికి గురించి మందు బాబులకు చాలా తెలుసు. ఇందులో రకరకాల బ్రాండ్లు కూడా ఉంటాయి. అయితే స్నేక్‌ వైన్‌ అనేది కూడా ఉందని చాలా మందికి తెలియదు. అయితే ఈవైన్‌ మనదగ్గర లేదు. మరి ఎక్కడ ఉంది.. ఎలా ఉంటుంది.. ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం.

చైనాలో స్నేక్‌వైన్‌..
ఈ స్నేక్‌ వైన్‌ ఎవరు తయారు చేస్తారంటే.. ఇంకెవరు మీకు తెలిసే ఉంటుంది. చైనీయులే. చిత్ర విచిత్రమైన ఆహారం తినే చైనీయులే ఈ స్నేక్‌వైన్‌ను కూడా తయారు చేస్తున్నారు. చైనా, థాయ్‌లాండ్, జపాన్, వియత్నాం దేశాల ప్రజలు ఈ వైన్‌ను ఎంతో ఇష్టంగా తాగుతారు.

ఎలా తయారు చేస్తారంటే..
ఈ స్నేక్‌వైన్‌ తయారీకి ముందుగా బతికి ఉన్న పాములను పట్టుకుంటారు. దానిని రెండు నుంచి మూడు రోజుల ఉపవాసం ఉంచుతారు. తర్వాత వైన్‌ ఉన్న జాడీల్లో ఈ పాములను వేస్తారు. ఆకలితో ఉన్న కారణంగా పాము ఆ వైన్‌ను తాగుతుంది. మత్తు కారణంగా స్పృహ కోల్పోతుంది. తర్వాత పాములోని వ్యర్థాన్ని బయటకు తీసి పామును మరో జాడీలోకి మారుస్తారు. తర్వాత పాము ఆ జాడీలోని వైన్‌ను తాగి తన రక్తాన్ని అందులోకి వదులుతుంది. ఇలా నాలుగైదు నెలలు ఉంచుతారు. క్రమంగా పాము వైన్‌ తాగుతూ చనిపోతుంది. ఇలా స్నేక్‌వైన్‌ తయారు చేస్తారు.

ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి..
ఈ స్నేల్‌ వైన్‌ను తాగడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తి చూపుతారు. చైనా, వియత్నాం, థాయ్‌లాండ్, జపాన్‌కు వెళ్లే టూరిస్టులు దీనిని రుచి చూస్తారు. ఇక దీనిని తాగినవారు తమ హెయిర్‌ఫాల్‌ కంట్రోల్‌ అయిందని, ఇమ్యూనిటీ పవర్‌ పెరిగిందని, బోన్స్‌ బలంగా తయారవుతన్నాయని చెబుతున్నారు. మరి అందులో ఎంత నిజముందు తెలియదు. ఎందుకంటే సైంటిఫిక్‌గా దీనికి ఆధారాలు లేవు.