https://oktelugu.com/

Senior NTR assets : సీనియర్ ఎన్టీఆర్ ఆస్తులెన్ని? అవి ఏమైపోయాయో తెలుసా?

Senior NTR Assets :  నందమూరి తారక రామారావు.. తెలుగు తెరను, తెలుగు రాజకీయాలను ఏలిన గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ ఎలా అయితే గుర్తింపు పొందారో.. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు కూడా అంతేస్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రతి సినీ ఇండస్ట్రీలో ఒక మహనీయుడు ఉన్నట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ఎన్టీఆర్ కృషి చేశారు. ఇప్పుడు నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 31, 2022 / 12:13 PM IST
    Follow us on

    Senior NTR Assets :  నందమూరి తారక రామారావు.. తెలుగు తెరను, తెలుగు రాజకీయాలను ఏలిన గొప్ప వ్యక్తిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ ఎలా అయితే గుర్తింపు పొందారో.. తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి తారకరామారావు కూడా అంతేస్థాయిలో గుర్తింపు పొందాడు. ప్రతి సినీ ఇండస్ట్రీలో ఒక మహనీయుడు ఉన్నట్టుగానే తెలుగు చిత్ర పరిశ్రమను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడానికి ఎన్టీఆర్ కృషి చేశారు.

    Senior NTR Assets

    ఇప్పుడు నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ ఉందంటే దానికి ఎన్టీఆర్ కృషినే కారణం. అటు కుటుంబాన్ని, ఇటు పార్టీని ఆయన అభివృద్ధి చేశారు. ఎన్నో ఆస్తులు కూడబెట్టారు. సినిమాల్లో సంపాదించిన సొమ్మును తన కుమారులకు సమంగా పంచారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ చెన్నైకి వెళ్లి సొంతకాళ్లపై నిలబడి హీరోగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఆస్తులు కూడబెట్టారు.

    Also Read: CM KCR: కేసీఆర్ లో టెన్ష‌న్ మొద‌లైందా.. ప‌ర్‌ఫెక్ట్ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారా..?

    రాయలసీమ దుర్భిక్ష నిధి కోసం ఊరువాడా తిరిగి అక్కడి ప్రజల కన్నీళ్లు తుడిచాడు ఎన్టీఆర్. అప్పటి సీఎం విజయభాస్కర్ రెడ్డి చొరవతో ప్రజలకు సేవ చేశారు. హైదరాబాద్ లోనూ ఆస్తులు కూడబెట్టారు. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాక ఎన్టీఆర్ మొదట ‘ఎన్టీఆర్ ఎస్టేట్ ప్రాంతం’ కొన్నారు. రామకృష్ణ థియేటర్ ను ఎంతో ముచ్చటపడి నిర్మించాడు. థియేటర్ పక్కనే బార్ తోపాటు కొన్ని ఆస్తులను కూడా కొన్నారు. ఇప్పుడు వీటి విలువ కోట్లలోనే ఉంటుంది. గ్రామాలనుంచి హైదరాబాద్ వచ్చిన వారంతా ఇప్పుడు ‘ఎన్టీఆర్ ఎస్టేట్’ను చూసిపోవాల్సిందే. ఎన్టీఆర్ నివసించిన ఇల్లు, రామకృష్ణ జంట థియేటర్లు, ఆహ్వానం హోటల్ కాంప్లెక్స్, ఎన్టీఆర్ ఎస్టేట్ లోని భాగాలే.

    ఎన్టీఆర్ సీఎంగా ఉన్నన్నీ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేక థియేటర్ ను నిర్మించాలని అనుకున్నారు.కానీ కొన్ని నగరాల్లోనే నిర్మించారు. ఎన్టీఆర్ సీఎం అయ్యేంత వరకూ నగరాల్లో థియేటర్లు కట్టడం.. ఖరీదైన స్థలాలు కొంటూ వెళ్లారు. ముషీరాబాద్ లోని రామకృష్ణ థియేటర్, కాచిగూడ చౌరస్తాలోని తారక రామా థియేటర్, మాసబ్ ట్యాంక్ లో గుట్టపై నిర్మించిన ఐదు స్వతంత్ర్య భవనాలు, ఇలా సినిమాల్లో సంపాదించిన ధనాన్ని బంగ్లాలు, థియేటర్లు, భూములపైనే ఎన్టీఆర్ వెచ్చించారు. ఆయనకొనుగోలు చేసిన ఐదు భవనాల్లో ఆయన ఐదుగురుకు కుమారులు ఉంటున్నారు.

    ఇక చివరగా కాపురం ఉన్న బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 13లో ఉన్న ఇంటిని తన రెండో భార్య లక్ష్మీపార్వతి పేరును మార్చేశారు. ఆ ఇంటికి పడమర వైపున ఉన్న ప్రాంతాన్ని, ఎదురుగా గుట్టుపై మ్యూజియం కూడా రాజకీయాల్లోకి వచ్చాక కొనుగోలు చేశారు.

    ఇక ఎన్టీఆర్ రాజకీయాలకు వేదికగా మారిన ‘గండిపేట ఆశ్రమం’, తెలుగు విజయం భూములను కూడా ముచ్చటపడి కొన్నారు. నాచారం హార్టికల్చర్ ఫిలిం స్టూడియోను నిర్మించారు. అప్పుడు ఎన్టీఆర్ కొన్న భూములన్నీ ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. ఆ ఆస్తుల వివరాలు లెక్కేస్తే వేల కోట్లు ఉండడం ఖాయమని అంటున్నారు.

    ఇక హైదరాబాద్ లోనే కాదు.. చెన్నైలోనూ కోట్లాది రూపాయల ఆస్తులను ఎన్టీఆర్ కూడబెట్టారు. తక్కువ రేటుకే అప్పుడు కొన్నారు. వాటి విలువ ఇప్పుడు కోట్లలోనే ఉంటుంది. ఎన్టీఆర్ సంపాదన అంతా చివర్లో తన అందరు కుమార్తెలు, కుమారులకు పంచిపెట్టారు. లక్ష్మీపార్వతికి ఓ ఇల్లు ఇచ్చేశాడు. ఇలా అన్ని ఆస్తులను వారసులకు ఇచ్చి చివరకు ఎన్టీఆర్ రాజకీయాల్లో దెబ్బలు తిని.. సొంత కుటుంబం వెన్నుపోటుతో గుండెపోటుతో మరణించారు.

    Also Read: Alia Bhatt And Ranbir Kapoor: ‘అలియా భట్’తో పెళ్లి పై స్టార్ హీరో రియాక్షన్