https://oktelugu.com/

Pavitra Lokesh: నరేష్ కంటే ముందు పవిత్రా లోకేష్ ఎంతమందితో సహజీవనం చేశారు?

Pavitra Lokesh: లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకున్న నరేష్, పవిత్రలు ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియో బయటకొచ్చింది. ఆ తరువాత దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అధికారికంగా అయ్యాయని, ఇప్పుడు పవిత్రను పెళ్లి చేసుకోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అటు పవిత్ర సైతం ఇద్దరితో సంబంధం పెట్టుకొని ఇప్పుడు మూడో వ్యక్తి నరేష్ తో కలిసి అడుగులు వేసేందుకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 13, 2023 / 05:58 PM IST
    Follow us on

    Pavitra Lokesh

    Pavitra Lokesh: లేటు వయసులో ఘాటుగా ప్రేమించుకున్న నరేష్, పవిత్రలు ఇటీవల పెళ్లి చేసుకున్నట్లు ఓ వీడియో బయటకొచ్చింది. ఆ తరువాత దుబాయ్ వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు, అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నరేష్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అధికారికంగా అయ్యాయని, ఇప్పుడు పవిత్రను పెళ్లి చేసుకోవడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అటు పవిత్ర సైతం ఇద్దరితో సంబంధం పెట్టుకొని ఇప్పుడు మూడో వ్యక్తి నరేష్ తో కలిసి అడుగులు వేసేందుకు రెడీ అయిందని అంటున్నారు. ఇంతకీ నరేష్ కంటే ముందు పవిత్రకు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయి? ఎంతమందితో సహజీవనం చేశారు? అనేది ప్రతి ఒక్కరిలో కన్ఫ్యూజ్ గా మారింది.

    మైసూర్ లో జన్మించిన పవిత్ర.. ఆమె తండ్రి లోకేశ్ కూడా నటుడే. ఆయన మరణాంతరం కుటుంబ బాధ్యతలు పవిత్రపై పడ్డాయి. దీంతో ఆమె బాగా చదువుకున్నా కుటుంబం కోసం బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవిత్రా ప్రత్యేక గుర్తింపుతెచ్చుకున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగులో తల్లి పాత్రల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడు సినిమాలున్నట్లు సమాచారం.

    ఈ క్రమంలో పవిత్ర పర్సనల్ లైఫ్ కాస్త ఒడిదొడుకులతోనే సాగింది. నరేష్ కంటే ముందు ఆమె సుచేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అంతకంటే ముందే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకున్నారు. కొంతకాలం తరువాత సుచేంద్ర ప్రసాద్ తో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. దీంతో కొంతకాలం వీరు సహజీవనం చేవారు.  2018 నుంచి వీరు దూరంగా ఉంటున్నట్లు పవిత్ర మీడియాకు తెలిపింది.

    ఇక సమ్మోహనం అనే సినిమా నుంచి పవిత్ర, నరేష్ ఆన్ స్క్రీన్ పై కెమెస్ట్రీ వర్కౌట్ కావడంతో అప్పటి నుంచి వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ప్రేమలో పడ్డట్లు తెలిపారు. ఓరోజు మీడియా ముందుకు వచ్చి తాము ప్రేమలో పడ్డామని, త్వరలో పెళ్లి చేసుకుంటామని పేర్కొన్నారు. ఇటీవల వారు సాంప్రదాయబద్దంగా ఈ జంట పెళ్లి చేసుకున్నట్లు ఓవీడియో రిలీజ్ అయింది. మొత్తంగా పవిత్రకు నరేష్ కంటే ముందు ఇద్దరితో ఎఫైర్ నడిపినట్లు చెప్పుకుంటున్నారు.