https://oktelugu.com/

Balagam movie : బలగం మూవీలో ఎన్ని లోపాలో… మీరు గుర్తించారా?

Balagam movie : బలగం మూవీ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. దర్శకుడు వేణు ఎల్దండి వెండితెరపై తెలంగాణా పల్లె జీవనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కుటుంబ అనుబంధాలు, మనస్పర్థలు, ఆప్యాయతలు గురించి గొప్పగా చెప్పారు. కొమురయ్య చావు చుట్టూ అల్లిన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అత్యంత సహజంగానే సాగే పాత్రలతో పాటు ప్రేక్షకులు ప్రయాణం చేశారు. మన ఊర్లో ఒక కుటుంబంలో జరుగుతున్న కథగా బలగం మూవీ తోస్తుంది. తెలంగాణ సంస్కృతి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2023 / 01:14 PM IST
    Follow us on

    Balagam movie : బలగం మూవీ అత్యంత ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. దర్శకుడు వేణు ఎల్దండి వెండితెరపై తెలంగాణా పల్లె జీవనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కుటుంబ అనుబంధాలు, మనస్పర్థలు, ఆప్యాయతలు గురించి గొప్పగా చెప్పారు. కొమురయ్య చావు చుట్టూ అల్లిన ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. అత్యంత సహజంగానే సాగే పాత్రలతో పాటు ప్రేక్షకులు ప్రయాణం చేశారు. మన ఊర్లో ఒక కుటుంబంలో జరుగుతున్న కథగా బలగం మూవీ తోస్తుంది.

    తెలంగాణ సంస్కృతి ని ఆవిష్కరించిన దర్శకుడు వేణు గురించి ప్రతి ఒక్కరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో బలగం మూవీలో కొందరు లోపాలు వెతుకుతున్నారు. క్రిటిక్స్, జర్నలిస్ట్స్ బలగం మూవీలో చెప్పిన కొన్ని విషయాలు, చూపించిన సన్నివేశాలు తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకం. అలాగే సిల్లీ పాయింట్స్ అంటూ కొట్టిపారేస్తారు. ప్రధానంగా వారు సూచించిన లోపాలు ఏమిటంటే…

    తండ్రి మరణిస్తే కొడుకులు పెద్దకర్మ రోజు తల వెంట్రుకలు తీసేస్తారు. బలగం తెలంగాణా సంప్రదాయాలకు ప్రతీకగా తీశామని చెప్పుకున్నప్పుడు కొమురయ్య కొడుకు పాత్రలు చేసిన నటులకు గుండు గీయాల్సింది. ఇది బలగం మూవీలోని లోపం గా చెప్పవచ్చంటున్నారు. మరో లోపం ఏమిటంటే… హీరో సాయిలు తన అప్పులు తీర్చుకోవడానికి మేనత్త కూతురు సంధ్యను వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. పెద్దలు కూడా వారికి వివాహం చేసేందుకు ఒప్పుకుంటారు.

    తెలంగాణ సాంప్రదాయంలో మేనత్తను, వాళ్ళ పిల్లలను గొప్పింటివాళ్లుగా చూస్తారు. మేనత్త కూతురిని మనువాడే పద్ధతి తెలంగాణలో లేదు. కాబట్టి ఇదో తప్పు అంటున్నారు. ఇక మటన్ బొక్క రాలేదని అల్లుడు బామ్మర్దుల మీద అలిగి 20 ఏళ్ళు భార్యను పుట్టింటికి దూరం చేయడం సిల్లీ పాయింట్ అంటున్నారు. మరీ మటన్ కోసం బొక్కల కోసం బంధాలు వదులుకునే వాళ్ళుగా తెలంగాణా జనాలను చిత్రీకరించాడని ఎద్దేవా చేస్తున్నారు.

    ఫైనల్ గా కాకి ముట్టలేదని ఒక కుటుంబాన్ని ఊరి పెద్దలు వెలివేయడం కూడా ఎక్కడ లేదంటున్నారు. ఇలా కొన్ని లోపాలు వెతుకుతున్నారు. అయితే సినిమా క్రియేటివిటీ ప్రాసెస్. ఇది డాక్యుమెంటరీ కాదు. ప్రేక్షకులను మెప్పించేందుకు దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటాడు. నిజ జీవితాలకు చాలా దగ్గరగా తీసిన బలగం లాంటి చిత్రాన్ని అభినందించాలి కానీ లోపాలు వెతకడం పరువు పోగొట్టుకోవడమే అని కొందరి వాదన