Homeఎంటర్టైన్మెంట్Rashmika Mandanna : నేను కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో ఆ దేవుడికే తెలియాలి, దీనస్థితిలో...

Rashmika Mandanna : నేను కోలుకునేందుకు ఎంత సమయం పడుతుందో ఆ దేవుడికే తెలియాలి, దీనస్థితిలో రష్మిక మందాన, ఫోటోలు వైరల్

Rashmika Mandanna : రష్మిక మందాన కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె హీరోయిన్ గా నటించిన చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబట్టాయి. యానిమల్, పుష్ప 2 చిత్రాల్లో రష్మిక హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. యానిమల్ రూ. 900 కోట్ల వసూళ్లు రాబట్టింది. సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో రష్మిక బోల్డ్ రోల్ చేయడం విశేషం. రన్బీర్ కపూర్ తో ఘాటైన ముద్దు సన్నివేశాల్లో నటించింది. ఇక పుష్ప 2తో ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది. పుష్ప 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఏకంగా బాహుబలి 2 రికార్డు లేపేసింది

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 బాలీవుడ్ బడా స్టార్స్ రికార్డులు కొల్లగొట్టింది. పుష్ప 2 హిందీ వెర్షన్ రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక చేతి నిండా చిత్రలతో రష్మిక మందాన బిజీగా ఉంది. బాలీవుడ్ బడా స్టార్ సల్మాన్ ఖాన్ కి జంటగా సికిందర్ మూవీ చేస్తుంది. ధనుష్, నాగార్జునల మల్టీస్టారర్ కుబేర చిత్రంలో సైతం ఆమె నటిస్తున్నారు. అలాగే ఆమె రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది.

క్షణం తీరిక లేకుండా షూటింగ్స్ చేస్తున్న రష్మిక అనుకోని ప్రమాదానికి గురైంది. జిమ్ లో వ్యాయామం చేస్తున్న రష్మిక కాలికి గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆమె రెస్ట్ తీసుకుంటున్నారు. కొన్నాళ్ళు రష్మిక తిరిగి షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు. తాజాగా రష్మిక తన గాయాన్ని రివీల్ చేసింది. పాదానికి కట్టుతో ఆమె కనిపించారు.

కోలుకునేందుకు రోజులు, నెలలు సమయం పడుతుందో ఆ దేవుడికే తెలియాలి. త్వరలోనే సికిందర్, కుబేర సెట్స్ లో అడుగు పెడతానని ఆశిస్తున్నాను. నా దర్శకులకు క్షమాపణలు. త్వరగా కోలుకుని మరలా యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటాను. ఈ లోగా ఒక మూలన కూర్చుని ఇతర పనులు చూసుకుంటాను, అని కామెంట్ పెట్టింది. రష్మిక కామెంట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

RELATED ARTICLES

Most Popular