https://oktelugu.com/

Nayanthara: గర్భం దాల్చకుండా నయనతార తల్లి ఎలా అయ్యింది?… అదో వ్యాపారం!

Nayanthara: సినిమా తారల జీవితాలు చాలా కుత్రిమంగా ఉంటాయి. ఎమోషన్స్ పాళ్ళు కూడా తక్కువే. ప్రతి విషయం కమర్షియల్ గా ఆలోచిస్తారు.కాగా తల్లి తనం కోసం కనీసం తొమ్మిది నెలలు సమయం కేటాయించలేకపోతున్నారు. సరోగసి హీరోయిన్స్ కి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులున్నాయి కదా అనే అహంతో గర్బాలను అద్దెకు తీసుకుంటున్నారు. స్టార్ లేడీ నయనతార తాజాగా అదే పద్ధతిలో ఇద్దరి పిల్లలకు తల్లయింది. నయనతారకు పెళ్ళై నాలుగు నెలలే కావడం విశేషం. పెళ్లికి ముందే ఈ […]

Written By:
  • Shiva
  • , Updated On : October 10, 2022 / 09:31 AM IST
    Follow us on

    Nayanthara: సినిమా తారల జీవితాలు చాలా కుత్రిమంగా ఉంటాయి. ఎమోషన్స్ పాళ్ళు కూడా తక్కువే. ప్రతి విషయం కమర్షియల్ గా ఆలోచిస్తారు.కాగా తల్లి తనం కోసం కనీసం తొమ్మిది నెలలు సమయం కేటాయించలేకపోతున్నారు. సరోగసి హీరోయిన్స్ కి పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. డబ్బులున్నాయి కదా అనే అహంతో గర్బాలను అద్దెకు తీసుకుంటున్నారు. స్టార్ లేడీ నయనతార తాజాగా అదే పద్ధతిలో ఇద్దరి పిల్లలకు తల్లయింది. నయనతారకు పెళ్ళై నాలుగు నెలలే కావడం విశేషం. పెళ్లికి ముందే ఈ జంట ఫ్యామిలీ ప్లానింగ్ చేశారని తాజా ఘటనతో రుజువైంది. నిన్న సోషల్ మీడియా వేదికగా నయనతార తమకు ట్విన్స్ జన్మించినట్లు ప్రకటించారు.

    Nayanthara

    నయనతార ప్రకటనకు అభిమానులు షాక్ అయ్యారు. గర్భం దాల్చకుండా పిల్లల్ని ఎలా కనిందని ఆశ్చర్యపోయారు. అవగాహన ఉన్నవారు మాత్రం… ఓహో నయనతార అలా చేశారా, అని సరిపెట్టుకున్నారు. జూన్ 9న నయనతార-విగ్నేష్ వివాహం జరిగింది. 2015 నుండి డేటింగ్ చేస్తున్న ఈ జంట అధికారికంగా మహాబలేశ్వరంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకు ముందే నయనతార-విగ్నేష్ రహస్య వివాహం చేసుకున్నారనే ప్రచారం ఉంది. నయనతార ఒకటి రెండు సందర్భాల్లో దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు పాపిట కుంకుమ పెట్టుకొని కనిపించారు.

    Also Read: Dhoni Entertainment: టాలీవుడ్ లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న ఎంఎస్ ధోని

    కేవలం పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకుంటారు. రహస్య వివాహంలో నిజం ఉన్నా లేకున్నా పెళ్ళికి ముందే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారని క్లియర్ గా అర్థం అవుతుంది. సరోగసి పద్ధతిలో పిల్లల్ని కనాలని నయనతార నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం కెరీర్ కోసం కూడా. ప్రస్తుతం నయనతార చేతిలో ఒక మలయాళం, రెండు తమిళ్ చిత్రాలు ఉన్నాయి. జవాన్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఆ చిత్రంలో షారుక్ హీరోయిన్.

    Nayanthara

    మరి నయనతార గర్భవతి అయితే ఆ సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడుతుంది. అదే సమయంలో బిడ్డను మోసి ప్రసవిస్తే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. మునుపటి మాదిరి ఫిట్ గా ఉండరు. ఇవన్నీ మనసులో పెట్టుకొని నయనతార ఇలా చేశారు. సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ అమ్మతనం కూడా వ్యాపారం ఐపోతుంది. కృత్రిమంగా పిల్లల్ని కనేస్తున్నారు. తొమ్మిది నెలలు మోసీ, ప్రసవ వేదనతో బిడ్డను పొందినప్పుడు తల్లికి దక్కే ఆనందం ఎన్ని కోట్లు ఇవ్వగలదు. మనుషుల మధ్య ఎమోషన్స్ పల్చబడిపోవడానికి ఇలాంటి పద్ధతులే కారణం.

    Also Read:Swathi Muthyam Collections: బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకొని డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలిన స్వాతి ముత్యం..ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా..?

    Tags