Holi 2025 : తెలంగాణ సాంప్రదాయాల ప్రకారం కొన్ని పండుగలు మద్యం ప్రధానంగా ఉంటుంది. విందు భోజనంలో భాగంగా మద్యం ను కూడా చేర్చుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా.. పార్టీలు జరిగినా మద్యం లేకుండా ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన పండుగల రోజు మద్యం అందుబాటులో లేకపోతే నిరాశ చెందుతారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణలో ప్రముఖ పండుగ ఆయన హోలీ రోజున మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. యువకులు, పెద్దలు, మహిళలు అంతా కలిసి నిర్వహించుకునే ఈ వేడుక సందర్భంగా మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే?
Also Read : హోలీ పండుగ రోజు ఇలా శుభాకాంక్షలు చెప్పి.. ఎదుటివారిని ఆకట్టుకోండి..
సాధారణంగా ఏదైనా ముఖ్యమైన పండుగను మద్యంతో నిర్వహించుకోవడం కొందరి అలవాటు. స్నేహితులు, బంధువులు అంతా కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేస్తారు. అలాగే ప్రముఖ పండుగ అయినా హోలీ రోజు కూడా ఎక్కువగా మద్యం సేవిస్తూ ఉంటారు. రంగుల పండుగ అయినా హోలీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత స్నేహితులు, బంధువులు కలిసి పార్టీలు నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం షాపులకు కూడా ఈరోజు అధికంగా ఆదాయం వస్తుంది.
కానీ తెలంగాణలో మాత్రం హోలీ రోజున మద్యం షాపులను మూసివేస్తున్నట్లు తెలిపింది. అయితే ఇది కేవలం హైదరాబాదులోనే.. నగరంలో ఎక్కువమంది వాహనాలపై తిరుగుతూ బంధువులను, స్నేహితులను కలుస్తూ హోలీ ఆడుతారు. ఈ క్రమంలో మద్యం తాగాలని కొందరు అనుకుంటారు. అయితే మద్యం షాపులు ఉండడంవల్ల మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై అవకాశం ఉంది. అంతేకాకుండా ఈరోజు యువకులు, బంధువులు అంతా కలవడం వల్ల మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ తరుణంలో అనేక సంఘటనలు నెలకొనే అవకాశం ఉంది. అయితే మద్యం సేవించని వారికి, మహిళలకు ఇలాంటి సంఘటనలు ఇబ్బందులకు గురిచేస్తాయి. అంతేకాకుండా వారు హోలీ వేడుకను ఆనందంగా నిర్వహించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో హోలీ పండుగ రోజున మద్యం షాపులను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే హైదరాబాద్ మినహా తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో మద్యం షాపులు తెరిచే ఉంటాయి. మార్చి 14 శుక్రవారం రోజున హోలీ పండుగ ఉన్నందున ఈరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు అందరూ రెడీ అవుతున్నారు. హోలీ కి ఒక రోజు ముందు గురువారం హోళికా దహనం వేడుకను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రధాన కూడళ్లలో కొన్ని కట్టలను వేసి కాలుస్తారు. వీటి చుట్టూ నీరు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజున హోలీ ఆడుతారు.
హోలీ ఆడే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రంగుల వాడక విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అంటున్నారు. అలాగే యువకులు ఈతకొలను వద్దకు వెళ్లకుండా ఇంట్లోనే స్నానం చేయాలని సూచిస్తున్నారు. ఎందుకంటే చాలామంది యువకులు ఇలాగే ఈతకొలనుకు వెళ్లి మరణించిన సంఘటనలు ఉన్నాయి.
Also Read : రంగుల పండుగపై మళ్లీ కన్‌ఫ్యూజన్.. ఏరోజు జరుపుకోవాలి.. పండితులు ఏం చెబుతున్నారంటే..